TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు టీఎస్ ఆర్టీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉప్పల్ నుంచి విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్కు మార్గంలో వెళ్లే 113 నంబర్ బస్సులను పునరుద్ధరించినట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వీఎస్టీ నుంచి ఇందిరా పార్కు మార్గంలో స్టీల్ బ్రిడ్జి ప్రారంభమైన నేపథ్యంలో 113 నంబర్ బస్సులు యథావిధిగా సేవలందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
రూట్ నంబర్ 113T I/M (ఉప్పల్ – మెహిదీపట్నం) – ఉప్పల్ ఎక్స్ రోడ్స్, హబ్సిగూడ, తార్నాక, అడిక్‌మెట్, విద్యానగర్, దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్, ఆర్టీసీ సీసీఎస్ ఆఫీసు, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్కు, రామకృష్ణ మఠం, సెక్రటేరియట్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం వరకు రాకపోకలు కొనసాగించనున్నాయి.
రూట్ నంబర్ 113Z I/M (ఉప్పల్ – మెహిదీపట్నం) – ఉప్పల్ ఎక్స్ రోడ్స్, రామంతపూర్, అంబర్‌పేట ఎక్స్ రోడ్స్, అలీ కేఫ్, జిందా తిలిస్మాత్, గోల్నాక, నింబోలి అడ్డా, కాచిగూడ టూరిస్ట్, బర్కత్‌పురా, ఫీవర్ హాస్పిటల్, శంకర్‌మఠ్, ఆర్టీసీ సీసీఎస్ ఆఫీస్, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్కు, రామకృష్ణ మఠం, సెక్రటేరియట్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం వరకు రాకపోకలు కొనసాగించనున్నాయి.
రూట్ నంబర్ 113T Y/K (ఉప్పల్ – కొండాపూర్) – ఉప్పల్ ఎక్స్ రోడ్స్, హబ్సిగూడ, తార్నాక, అడిక్‌మెట్, విద్యానగర్, దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్, ఆర్టీసీ సీసీఎస్ ఆఫీసు, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్కు, రామకృష్ణ మఠం, సెక్రటేరియట్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్‌పేట, మైత్రివనం, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్, హైటెక్ సిటీ, శిల్పారామం మీదుగా కొండాపూర్ వరకు రాకపోకలు కొనసాగించనున్నాయి.