కోత లేకుండా రంధ్రం పూడ్చి!
గుండెలో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ) వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారికి హైటెక్‌సిటీలోని మెడికవర్ దవాఖానలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు.
- 11 నెలల చిన్నారికి మెడికవర్‌లో మెరుగైన వైద్యం
కొండాపూర్, ఏప్రిల్ 25 : గుండెలో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ) వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారికి హైటెక్‌సిటీలోని మెడికవర్ దవాఖానలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ సప్రె వెల్లడించారు. సోమాలియాకు చెందిన ముస్తల్ఫా అబ్రిస్క్ అహ్మద్ (11 నెలలు) గుండెలో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ వ్యాధి (గుండెలో రంధ్రం)తో బాధపడుతున్నది. కాగా వారు సోమాలియా నుంచి ఇక్కడి పలు దవాఖానలను సంప్రదించగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండెలోని రంధ్రాన్ని పూడ్చాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు మెడికవర్ దవాఖానను ఆశ్రయించారు. ఇక్కడి వైద్యులు కోతలు లేకుండా వీఎస్డీ పరిరకం అమర్చి డివైస్ క్లోజర్ విధానాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నదని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావని వైద్యులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

