Weekly Horoscope | మేషం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు.
వృషభం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రాజకీయ, ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. పనిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. వ్యవసాయదారులకు అనుకూల సమయం. దిగుబడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. వ్యాపారులు చట్టపరమైన సమస్యలను అధిగమిస్తారు.
మిథునం
రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు పనిలో భారం పెరుగుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. వాదప్రతివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సంయమనంతో వ్యవహరించండి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు నిదానంగా సాగుతాయి. వారాంతంలో ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నిలిచిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం.
కర్కాటకం
తలపెట్టిన ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా అనుకూలిస్తాయి. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు.
సింహం
స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. వారాంతంలో ఖర్చులు పెరుగుతాయి. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించండి.
కన్య
విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కార్య సాఫల్యం ఉంది. ప్రయాణాల ద్వారా పనులు నెరవేరుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాల వల్ల సమస్యలు రావచ్చు. వాహనం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. కోర్టు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఏకాగ్రతతో పనులు చేస్తారు. పెద్దల సలహాలను అమలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. నూతన ఒప్పందాలపై దృష్టిసారిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
తుల
ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. వారాంతంలో పనిలో ఒత్తిడి పెరగవచ్చు. తప్పుదారి పట్టించే వ్యక్తులు ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఖర్చులు పెరగవచ్చు. భాగస్వాముల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవడం అవసరం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
వృశ్చికం
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి. న్యాయపరమైన సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనుల కారణంగా డబ్బు, సమయం వృథా అవుతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. తలపెట్టిన పనులు మొదట్లో నత్తనడకన సాగినా, వారాంతంలో వేగం పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి.
ధనుస్సు
తలచిన పనులు నలుగురి సహకారంతో పూర్తవుతాయి. పెద్దల సూచనలను పాటించడంతో కార్య సాఫల్యం ఉంటుంది. విద్యార్థులకు కలిసివస్తుంది. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. ఇంటాబయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. పైరవీలు ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు.
మకరం
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూల సమయం. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. బాకీలు వసూలు అవుతాయి.
కుంభం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. సంయమనం అవసరం. సహోద్యోగులతో సఖ్యతతో మెలగండి. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ఆరోగ్యంగా ఉంటారు.
మీనం
స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. విద్యార్థులకు కలిసివస్తుంది. విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. నిలిచిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.