తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్యారాధన శుభప్రదం.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త పాటించండి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విదేశీ విద్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
అదృష్టం కలిసివస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ఉద్యోగులకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. రాబడి పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సూర్యారాధనతో మేలు జరుగుతుంది.
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పనిభారం అధికమవుతుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. అయితే ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శివారాధనతో మేలు జరుగుతుంది.
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంయమనం పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. సాహితీవేత్తలకు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రామాలయాన్ని దర్శించుకోండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in