Ugadi Panchangam 2022 | కుంభ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
కుంభం
ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 2
రాజపూజ్యం: 5 అవమానం: 4
చైత్రం: శ్రద్ధతో పనులు చేస్తే విజయం వరిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు.
వైశాఖం: పనులు పూర్తి చేయడంలో సంయమనం, నైపుణ్యం అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
జ్యేష్ఠం: నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. వ్యాపారం సాఫీగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో ఇబ్బందులు రావచ్చు. సంపాదన స్థిరంగా ఉంటుంది.
ఆషాఢం: బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అన్ని పనులు దగ్గర ఉండి పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూలం.
శ్రావణం: సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే వివాదాల జోలికి వెళ్లకండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం.
భాద్రపదం: ఉద్యోగులు అధికారులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులుచేస్తారు.
ఆశ్వయుజం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. భూ తగాదాలు ముందుకు వస్తాయి. మనశ్శాంతి కొరవడుతుంది. వ్యాపార విస్తరణ వాయిదా పడుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
కార్తికం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. మనస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ధైర్యంతో ముందుకు వెళతారు. రావలసిన డబ్బు సమయానికి అందకపోవడంతో సర్దుబాట్ల అవసరం ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు.
మార్గశిరం: వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమించ వలసిన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. శ్రమ ఎక్కువ అవుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. అధికారుల ఆదరణ ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు.
పుష్యం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఇంటా, బయటా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు
మాఘం: పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుంది. చివరికి విజయవంతంగా పూర్తిచేస్తారు. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆత్మీయులతో వివాదాలు తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ఫాల్గుణం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. సంయమనంతో ఉండటం మంచిది. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అన్నీ చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
* ఈ రాశి వారికి ద్వితీయ గురువు సత్ఫలితాలు ఇస్తాడు. మూడింట రాహువు యోగిస్తాడు. ఏల్నాటి శని ప్రభావం ఉంది. నవమ కేతువు వల్ల చికాకులు ఉంటాయి. శని, కేతువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకం చేయించండి. శివారాధన, సుబ్రహ్మణస్వామి సేవ చేసుకుంటే శుభాలు కలుగుతాయి.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

