
మేషం: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
వృషభం: కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
మిథునం: మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
కర్కాటకం: పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.
సింహం: బంధు మిత్రుల సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
కన్య: తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
తుల: విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
వృశ్చికం: కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
ధనుస్సు: శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
మకరం: వృత్తిరీత్యా ఇబ్బందులు అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
కుంభం: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
మీనం: అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868