e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News 21-05-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

21-05-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

21-05-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టంప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం అవ‌స‌రం.

వృష‌భం: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హించుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క త‌ప్ప‌దు.

మిథునం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు నెర‌వేరుతాయి. దూర‌పు బంధువుల‌తో క‌లుస్తారు. త‌ద్వారా లాభాలు ఉంటాయి. విదేశ‌యాన ప్ర‌యత్నాలు సంపూర్ణంగా నెర‌వేర్చుకుంటారు. ఆక‌స్మిక ధ‌నలాభ‌యోగం ఉంటుంది. అన్నివిష‌యాల్లో విజ‌యాన్ని సాధిస్తారు.

క‌ర్కాట‌కం: ఆక‌స్మిక ధ‌నలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. స‌మాజంలో గౌర‌వ ల‌భిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ప్ర‌తి విష‌యంలో అభివృద్ధి ఉంటుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

సింహం: మాన‌సిక ఆనందం ల‌భిస్తుంది. గ‌తంలో వాయిదా వేయ‌బ‌డిన ప‌నులు పూర్త‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. కొన్ని జ‌టిల‌మైన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

క‌న్య‌: త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విష‌యాల్లో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. ఆవేశం వ‌ల్ల కొన్ని ప‌నులు చెడిపోతాయి.

తుల‌: అనారోగ్య బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క‌పోవ‌డంతో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి.

వృశ్చికం: త‌ల‌చిన కార్యాల‌న్నీ విజ‌య‌వంతంగా పూర్తిచేసుకోగ‌లుగుతారు. బంధు, మిత్రుల మ‌ర్యాద మ‌న్న‌న‌ల‌ను పొందుతారు. అనారోగ్య బాధ‌లు ఉండ‌వు. స‌హ ఉద్యోగుల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ల‌భిస్తుంది. మీ ఆలోచ‌న‌లు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉంటాయి. అనుకూల ప‌రిస్థితులు ఎర్ప‌డ‌తాయి.

ధ‌నుస్సు: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించ‌డం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యంతో రుణ‌ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ‌సేవ అవ‌స‌రం.

మ‌క‌రం: కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచలంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది. పిల్ల‌ల‌ప‌ట్ల మిక్కిలి జాగ్ర‌త్త వ‌హిస్తారు. కొన్ని మంచి అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండ‌వు.

కుంభం: వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉంటాయి. ఏ విష‌యంలోను స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అనుకోని ఆప‌ద‌ల్లో చిక్క‌కోకుండా
గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది.

మీనం: స్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ఒక అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ప్ర‌యాణాల వ‌ల్ల లాభాన్ని పొందుతారు. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
21-05-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

ట్రెండింగ్‌

Advertisement