13-03-2022 ఆదివారం.. మీ రాశి ఫలాలు
మేషం : వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
వృషభం : ఆకస్మిక ధనలాభముంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
మిథునం : స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటరు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలధికమవుతాయి.
కర్కాటకం : పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
సింహం : ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిన ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కన్య : తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించారదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
తుల : బంధు, మిత్రులతో మనస్పర్థాలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు, మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.
వృశ్చికం : కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
ధనుస్సు : శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుదురు.
మకరం : స్త్రీల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబమంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కుంభం : రుణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మీనం : ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలనం సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

