మేషం : అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
వృషభం : అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్న సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి ఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.
మిథునం : వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
కర్కాటకం : నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
సింహం : రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలేర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండుట మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
కన్య : ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృ బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
తుల : ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమగును. కీళ్ల నొప్పుల బాధ నుండి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు.
వృశ్చికం : వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనలతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
ధనుస్సు : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండుట మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
మకరం : ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
కుంభం : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండుటచే మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
మీనం : అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండుట మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868