మేషం : బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
వృషభం : ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
మిథునం : సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నాకార్యాలన్నింటో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
కర్కాటకం : ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించేందుకు రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి.
సింహం : సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
కన్య : మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు.
తుల : ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
ధనస్సు : శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.
మకరం : నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
కుంభం : అపక్తీరి రాకుండా జాగ్రత్తపడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.
మీనం : వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.