e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News 02-07-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

02-07-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌ల‌ను క‌లిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌర‌విస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్య‌మిస్తారు.

వృష‌భం: ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌నష్టంప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం అవ‌స‌రం.

- Advertisement -

మిథునం: స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రింప‌బ‌డుతాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ‌వ‌హిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. భ‌క్తిశ్ర‌ద్ధ‌లు అధిక‌మ‌వుతాయి.

క‌ర్కాట‌కం: ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. వృత్తిరీత్యా గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పొందుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. మ‌నోల్లాసాన్ని పొందుతారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి.

సింహం: ఇత‌రుల‌తో గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. ప్ర‌తిప‌ని ఆల‌స్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

క‌న్య‌: త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్లో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. మోస‌పోయే అవ‌కాశాలు ఉంటాయి. ఆర్థిక‌ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంది. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కూడ‌దు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు.

తుల‌: త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విష‌యాల్లో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. ఆవేశం వ‌ల్ల కొన్ని ప‌నులు చెడిపోతాయి.

వృశ్చికం: కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదావేసిన ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్ప‌డుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్య‌వ‌సాయ మూల‌కంగా లాభాల‌ను పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ ఫ‌లిస్తాయి. సూక్ష్మ విష‌యాల‌ను గ్ర‌హిస్తారు.

ధ‌నుస్సు: బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. చేసే ప‌నుల‌లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప‌నుల‌ను ప్రారంభించ‌డం మంచిదికాదు. గృహంలో జ‌రిగే మార్పుల‌వ‌ల్ల ఆందోళ‌న చెందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

మ‌క‌రం: కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. మాన‌సిక ఆందోళ‌నను తొల‌గించుకోవ‌డానికి దైవ‌ధ్యానం అవ‌స‌రం. శారీర‌క అనారోగ్యంతో బాధ‌ప‌డుతారు. కుటుంబ విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ‌వుతాయి. ధ‌న‌వ్య‌యం త‌ప్ప‌దు.

కుంభం: కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచ‌లంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది. పిల్ల‌ల‌ప‌ట్ల మిక్కిలి జాగ్ర‌త్త వ‌హిస్తారు. కొన్ని మంచి అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉండ‌వు.

మీనం: రుణ‌ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. శుభ‌కార్యాల మూల‌కంగా ధ‌న‌వ్య‌యం అధిక‌మ‌వుతుంది. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. అనారోగ్యం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana