Horoscope | 13-07-2024 శనివారం.. మీ రాశి ఫలాలు
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంలో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. మంచి అవకాశాలను కోల్పోతారు. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం.
వృషభం
ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
మిథునం
గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కవగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. ధనచింత ఉండదు.
సింహం
అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
కన్య
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టేకార్యాలకు దూరంగా ఉంటారు.
తుల
ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం
స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలు ఉండవు.
ధనుస్సు
పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
మకరం
ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
కుంభం
బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మీనం
వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

