అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమయోచిత నిర్ణయాలతో అన్నిటా విజయం సాధిస్తారు. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. సూర్యారాధన శుభప్రదం.
వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులు పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల సహకారం అందుతుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. బంధువులతో కార్యసిద్ధి ఉంది. ఆస్తి తగాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి. రాజకీయ, కోర్టు పనులలో ఫలితాలు అనుకూలం. ఆదాయం అస్థిరం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శివాలయాన్ని సందర్శించండి.
ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సమయస్ఫూర్తితో విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వారం మధ్యలో ఊహించని ఖర్చులు. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. భూమి కొనుగోలు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార విస్తరణలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది.
దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం అనుకూలంగా ఉన్నది. విహార యాత్రలకు వెళ్తారు. కొత్త పనులు ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారులకు మంచి సమయం. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వెలువడుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. శుభవార్త వింటారు. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. ప్రయాణాలతో కార్య సాఫల్యం ఉంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలన సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణం, ఇంటి మరమ్మతులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేపడతారు. భూ లావాదేవీల్లో లాభాలు అందుకుంటారు. హనుమత్ ఆరాధన శుభప్రదం.
ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆదాయం పెంచుకోవడంపై దృష్టిసారిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్నేహితుల వల్ల కార్యసిద్ధి ఉంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. రామాలయాన్ని సందర్శించండి.
సంతోషంగా పనులు చేస్తారు. అధికారులతో సఖ్యత నెలకొంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. బంధువర్గంతో కార్యసిద్ధి ఉంది. అన్నదమ్ములతో అనుబంధం పెరుగుతుంది. వాహనం, భూముల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి.
కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అదృష్టం కలసివస్తుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉత్సాహంగా ఉంటారు. నూతన బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారు. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.అధికారుల అండదండలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. స్థిరచరాస్తుల విషయంలో తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. బంధువర్గంతో
సత్సంబంధాలు నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇష్టదేవతార్చన శుభప్రదం.
శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు పాక్షికంగా అందుతుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాదాల మూలంగా మనశ్శాంతి లోపిస్తుంది. సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఈశ్వరారాధనతో అన్నివిధాలా మేలు జరుగుతుంది.
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచిస్థాయిలో నిలుస్తారు. విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు రావలసిన డబ్బు వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దూర ప్రయాణాలతో కార్యసిద్ధి ఉంది. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. కొత్తవస్తువులు కొనుగోలు చేస్తారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.