మేషం
ఆలోచించి పనులు చేయడం వల్ల కార్యసాఫల్యత ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో, తోటివారితో సంతృప్తిగా ఉంటుంది. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మంచిపేరు సంపాదిస్తారు. ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. పనులలో ఉత్సాహం ప్రదర్శిస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు, చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. అయినా, వారివల్ల పనులు నెరవేరే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
వృషభం
ఆత్మీయులతో కలిసి పనులు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. వ్యాపారం కలిసివస్తుంది. పనిభారం వల్ల ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అధికారుల సూచనల మేరకు వ్యవహరించడం వల్ల అన్నివిధాలా కలిసివస్తుంది. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. గతంతో పోల్చిన ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుంది. మానసిక ఇబ్బందులను అధిగమించడానికి పనులను విశ్వాసంతో చేస్తారు. పట్టుదలతో ముందుకు వెళతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో ముఖ్యమైన పనులలో జాప్యం ఉండవచ్చు. ఆదాయ మార్గంపై మనసు నిలుపుతారు.
మిథునం
తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. సమాజంలో మంచిస్థితిలో ఉన్నవారితో స్నేహం ఏర్పడుతుంది. తద్వారా పనులు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలను సరైన సమయంలో ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు పొందుతారు. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల ప్రశంసలు, ఆదరణ లభిస్తాయి. తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఉండవచ్చు. సమయానుకూలంగా పనులు చేసి సంతృప్తిని పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురి సహకారంతో ఆర్థిక ఇబ్బందులున్నా శుభకార్యాలు చేస్తారు. ఇంట్లో అందరితోనూ సంతృప్తిగా సమయాన్ని గడుపుతారు. కావలసిన వస్తువులను కొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది.
కర్కాటకం
గతంతో పోల్చితే ఈ వారంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. సమయానుకూలమైన నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఫలితాలు సంతృప్తిగా ఉంటాయి. బంధువులు, స్నేహితులతో ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో స్థానచలనం ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ వ్యవహారంలో వృథా ఖర్చులు ఉండవచ్చు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.
సింహం
వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యాయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆదరణ లభిస్తాయి. ఒక పక్క పనిభారం పెరిగినా సంతృప్తిగా స్వీకరిస్తారు. సంతోషంతో పనులు చేస్తారు. స్నేహితులు, ఆత్మీయుల రాకవల్ల ఖర్చులు పెరుగుతాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కళాకారులకు వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. మంచి అవకాశాలతో నలుగురిలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి.
కన్య
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. చాలా పనులు నెరవేరుతాయి. బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. స్నేహితులవల్ల పనులు కలిసివస్తాయి. ఉద్యోగులు తోటివారితో సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. పై వారి విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. పనిపై మనసు నిలుపడం మంచిది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వివాహం, ఉద్యోగం, చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆలోచనలను సరైన సమయంలో అమలు చేస్తారు. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. కొత్త అవకాశాలతో సంతృప్తిగా ఉంటారు.
తుల
సమాజంలోని పెద్దల తోడ్పాటుతో పనులు నెరవేరుతాయి. పిల్లల విషయంలో సమయం కలిసివస్తుంది. మంచిస్థాయిలో నిలుస్తారు. పై చదువులకు అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారంతో కొన్ని పనులలో సత్ఫలితాలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు కొంతవరకు సఫలీకృతమవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని పనులలో జాప్యం ఉండవచ్చు. ఆదాయంపై మనసు నిలుపుతారు. అన్నదమ్ములు, ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరుగవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. అయినా, బాధ్యతలను సంతృప్తిగా స్వీకరిస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. గతంలో ఇచ్చిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది.
వృశ్చికం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా ఉంటాయి. గతంలో చేబదులుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనులు పూర్తి చేయడంలో కొంత ఆలస్యం జరుగవచ్చు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. గౌరవంగా జీవనాన్ని కొనసాగిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. భార్యాపిల్లలతో, కుటుంబసభ్యులతో హాయిగా గడుపుతారు. స్నేహితులు, బంధువర్గం వల్ల పనులు నెరవేరుతాయి. శ్రామికులకు, పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలు అందుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడటం అవసరం. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధువులు, స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. వాహనాలవల్ల ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో, పై అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో ఉండటం, పనులపై మనసు నిలపడం అవసరం. ఇంట్లో కుటుంబసభ్యులు అందరితోనూ ఉత్సాహంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేయడంలో జాప్యం జరుగవచ్చు. సంగీత, సాహిత్య కళాకారులకు కలిసివస్తుంది. ఆదాయం సంతృప్తిగానే ఉంటుంది. గత సర్దుబాట్లవల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు.
మకరం
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉత్సాహంతో ఉంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారి సాహచర్యం లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. కొన్ని వృథా ఖర్చులున్నా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. గుళ్లను సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టుల విషయంలో సుముఖంగా ఉంటారు. భాగస్వాముల సహకారం లభిస్తుంది. సమస్యలు చాలా మటుకు పరిష్కారమవుతాయి. మంచి ఆలోచనలు, ప్రణాళికలతో పనులు చేస్తారు.
కుంభం
ముఖ్యమైన పనులకు డబ్బు సర్దుబాట్లు అవసరం పడవచ్చు. రావలసిన డబ్బు పాక్షికంగా అందుతుంది. సమాజంలో మంచివారి స్నేహం వల్ల ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అన్ని విధాలుగా లభిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగం, భూముల కొనుగోలు పాక్షికంగా కలిసివస్తుంది. ఆర్థిక సమస్యవల్ల ముఖ్యమైన పనులలో ఆలస్యం ఉంటుంది. ఆలోచనలను సకాలంలో ఆచరణలో పెడతారు. సంగీత, సాహిత్య, కళాకారులకు అనుకూలమైన వారం. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
మీనం
నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెంపొందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు, స్థిర, చరాస్తులవల్ల ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం చేయడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో అనుకూలంగా ఉంటారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. నిర్మాణ విషయంలో ప్రయత్నాలు కొనసాగుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in