23.5.2021 నుంచి 29.5.2021 వరకు
మేషం
ప్రారంభించిన పనులు కలిసివస్తాయి. ఆరోగ్యం నయమవుతుంది. బంధుమిత్రాదులతో పనులు నెరవేరుతాయి. వాహనాలవల్ల పనులు అనుకూలిస్తాయి. నిత్యవ్యాపారంలో లాభాలు ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందినా వృథాఖర్చులు ఉండవచ్చు. ఆదాయం స్థిరంగానే ఉంటుంది. సమాజంలో అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుంటారు. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్, భూములు, నిర్మాణరంగంలో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులున్నా పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు అందరి సహాయంతో ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. సంతోషంగా ఉంటారు.
వృషభం
సాంస్కృతిక, సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగవచ్చు. బంధువర్గంతో ఆత్మీయత పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. రావలసిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. ఆఫీసులో పై అధికారులతో స్నేహభావం పెంచుకోవడం అవసరం. తోటి ఉద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలవల్ల పనులలో కొంత ఆలస్యం జరుగవచ్చు. ఆహార విషయాలు, అలవాట్లకు ప్రాధాన్యమిస్తూ , ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
మిథునం
ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో అధికారులతో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. నలుగురి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలవల్ల పనులలో కొంత జాప్యం జరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. స్థాన చలనం ఉండవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ఖర్చుల నియంత్రణపై మనసు పెట్టాలి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరిగినా అదే విధంగా ఖర్చులుకూడా ఉండవచ్చు. వ్యాపారంలో ఆర్థిక పరమైన నిర్ణయాలను కొన్ని రోజులకోసం వాయిదా వేసుకోవడం మంచిది.
కర్కాటకం
వృత్తి, వ్యాపారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తారు. తాత్కాలిక విజయం చేకూరుతుంది. సంతృప్తిగా ఉంటారు. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. తలపెట్టిన పనులలో కొంత ఆలస్యం ఉండవచ్చు. వ్యాపారస్తులకు భాగస్వాములతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా పరిష్కరించుకోవడం, ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఉద్యోగస్తులు పై అధికారుల ఆదరణతో కొంత సంతృప్తిని పొందుతారు. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూలత ఉంటుంది.
సింహం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకోసం ప్రయత్నిస్తారు. ఆస్తుల తగాదాలు పరిష్కారమై ఆదాయం పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు సిబ్బందితో అనుకూలంగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ మార్పు ఉంటుంది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
కన్య
స్నేహితులు, బంధువర్గం ప్రోత్సాహం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది. వృథా ఖర్చులు ఉంటాయి. పిల్లల చదువు విషయంలో కలిసివస్తుంది. పట్టుదల, విశ్వాసంతో పనులు చేస్తారు. నలుగురి ఆదరాభిమానాలను పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక పోవడంతో కొన్ని పనులలో ఆలస్యం, ఆటంకాలు ఉండవచ్చు. ప్రవచనాలు, ఆధ్యాత్మికతలపై మనసు నిలుపుతారు. కొన్ని విషయాలలో అదృష్టం సహకరిస్తుంది. కొన్ని వృథా ఖర్చులు ఉండవచ్చు.
తుల
గతంతో పోల్చితే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువులో ఏకాగ్రత ప్రదర్శించి, మంచిస్థాయిలో నిలుస్తారు. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో చిన్నపాటి మనస్పర్థలు ఉండవచ్చు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. స్నేహితులు, ఆత్మీయుల సహకారం పొందుతారు. కుటుంబపెద్దల సూచనలు పాటించడంతో కొన్ని విషయాలలో మెరుగైన ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో మంచివారితో సాహచర్యం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో మంచిపేరు, గౌరవ మర్యాదలు ఉండటంతో చాలా విషయాలలో అనుకూలత చేకూరుతుంది. పిల్లల విద్యా ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి.
ధనుస్సు
ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక సమస్యలున్నా బంధుమిత్రుల సహకారంతో అధిగమిస్తారు. అధికారులతో స్నేహాన్ని పెంచుకోవడంపై మనసు నిలుపుతారు. ఆదాయం సంతృప్తిగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. అన్ని విషయాలను, చేయబోయే పనులను నలుగురితో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. కాలయాపనకు తావివ్వకుండా పనులు పూర్తి చేసుకుంటూ వెళతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి.
మకరం
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విస్తరణకై ప్రయత్నాలు చేస్తారు. భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. అనుకోని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులలో ఆలస్యం ఉండవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల వివాహం నిశ్చయం కావచ్చు. చదువు విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలతో కార్యసాఫల్యత ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వారం.
కుంభం
ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారం లభిస్తుంది. చదువు, ఉద్యోగాల విషయంలో సానుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో తాత్కాలిక ప్రయోజనం ఉండవచ్చు. స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగించడం అవసరం. తోటి ఉద్యోగులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. అధికారుల అండకై ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమాజంలో ఉన్న మంచిపేరువల్ల కొన్ని పనులు కలిసివస్తాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా అందడం, వృథా ఖర్చులవల్ల సర్దుబాట్లు అవసరం పడవచ్చు. ముఖ్యంగా ఈ వారం ఖర్చుల నియంత్రణ అత్యవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం
రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తుల తగాదాలు పరిష్కారమై ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో అందరి సహకారాన్ని పొందుతారు. నలుగురికి సహాయం చేయడంపై మనసు నిలుపుతారు. శుభకార్యాలవల్ల ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారంలో శ్రమ ఉన్నా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయస్తులవల్ల పనులు నెరవేరినా అనవసర ఖర్చులు ఉండవచ్చు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in