మద్యం మత్తులో ‘నీట్’కు..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామంలోని నీట్ పీజీ పరీక్షకు ఓ విద్యార్థి మద్యం మత్తులో హాజరైన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఆదివారం 8గంటల సమయంలో శేరిగూడ సమీపంలోని నీట్ పరీక్ష కేంద్రానికి హాజరయ్యాడు. అతడి తీరుపై అనుమానం కలిగిన సిబ్బంది తనిఖీ చేయగా, అతడు మద్యం సేవించినట్టు నిర్ధారించారు.
- తనిఖీ చేయడంలో బయటపడిన వైనం
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామంలోని నీట్ పీజీ పరీక్షకు ఓ విద్యార్థి మద్యం మత్తులో హాజరైన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఆదివారం 8గంటల సమయంలో శేరిగూడ సమీపంలోని నీట్ పరీక్ష కేంద్రానికి హాజరయ్యాడు. అతడి తీరుపై అనుమానం కలిగిన సిబ్బంది తనిఖీ చేయగా, అతడు మద్యం సేవించినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది పరీక్షకు అనుమతించలేదు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సిబ్బంది పకడ్బందీగా పరీక్షను నిర్వహించారు.
నీట్-పీజీకి 97.26 శాతం హాజరు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 56 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన నీట్-పీజీ-2026 పరీక్షకు 97.26శాతం హాజరు నమోదైందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 17,626 మంది హాజరు కావాల్సి ఉండగా, 17,143 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు. 483 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా, రీజినల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ పరీక్షల నిర్వహణను పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
Harish Rao | మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్
Land Scam | మాజీ డీజీపీ భూమికి ఎసరు.. 4.27 ఎకరాల పట్టాభూమి రియల్టర్ పేరు పైకి!
KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

