నిద్రలేమితో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Health tips | కంటినిండా నిద్రపోతే మనసు, శరీరం హాయిగా ఉంటాయి. అయితే, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి లాంటి వాటివల్ల కొందరికి
Health tips: కంటినిండా నిద్రపోతే మనసు, శరీరం హాయిగా ఉంటాయి. అయితే, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి లాంటి వాటివల్ల కొందరికి సరిగా నిద్రపట్టదు. దాంతో శారీరకంగా నీరసించిపోతారు. మానసికంగా ఆందోళన పెరుగుతుంది. అయితే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మనం కూడా అవేంటో తెలుసుకుందామా..?
అశ్వగంధ
అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దానివల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ సహజంగా ట్రైఎథిలిన్ గ్లైకాల్ను కలిగి ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. మంచి నిద్ర కోసం మీరు పడుకోవడానికి 30 నిమిషాలు ముందు అశ్వగంధను తీసుకోవచ్చు.
బాదాం
బాదాంలో ఫైబర్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాదాంలో మెగ్నీషియం ఉంటుంది. నిద్ర సహాయక కారకం అయిన మెలటోనిన్ నియంత్రణకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం మీ కండరాలను కూడా సడలింపజేస్తుంది. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.
జాజికాయ పాలు
ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ కలిపి తీసుకోవడంవల్ల నిద్ర మెరుగుపడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండూ మంచి నిద్రకు తోడ్పడుతాయి.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలను పెపిటాస్ అని కూడా అంటారు. వీటిలో ట్రిప్టోఫాన్తోపాటు జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ సెరటోనిన్ను నిర్మించడంలో సహాయపడతాయి. సెరటోనిన్ నిద్రను మెరుగుపరుస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

