ఫుడ్ పీరియడ్!
రుతుక్రమ సమయంలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అంతులేని నిస్సత్తువ మరో ఎత్తు. హార్మోన్లలో మార్పులతో పాటు, నిద్రాణంగా ఉన్న మానసిక సమస్యలు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ముఖ్య కారణాలే.
రుతుక్రమ సమయంలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అంతులేని నిస్సత్తువ మరో ఎత్తు. హార్మోన్లలో మార్పులతో పాటు, నిద్రాణంగా ఉన్న మానసిక సమస్యలు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ముఖ్య కారణాలే. ఈ నిస్ర్తాణాన్ని జయించేందుకు కొన్ని ఆహార అస్ర్తాలు ఉన్నాయి. ఆ సమయంలో దూరం పెట్టాల్సిన పదార్థాలూ లేకపోలేదు.

ఇవి తినాలి..
ఆకుకూరలు: రుతుస్రావంతో కలిగే రక్తలేమిని సరిదిద్ది, మనసుకు ఉత్తేజాన్ని అందిస్తాయి.
అల్లం: వాపును తగ్గించి పీరియడ్స్తో పాటు వచ్చే కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
డార్క్ చాక్లెట్: ఇందులోని మెగ్నీషియం రుతుస్రావపు నొప్పులను నివారిస్తుంది. ఒంట్లోని సానుకూలమైన హార్మోన్లకు ప్రేరకంగా నిలుస్తుంది.
నారింజ: విటమిన్-సి పుష్కలంగా ఉండే నారింజ లాంటి పండ్లు రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. ఐరన్ శాతాన్ని పెంచి.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

అరటిపండ్లు: వీటికి రక్తపోటును నియంత్రించడంతో పాటుగా, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే సత్తువ కూడా ఉంది.
ఇవి వద్దు..
కెఫిన్: దీంతో మానసిక అలజడి పెరగడమే కాకుండా, రుతుస్రావం మీద నేరుగా ప్రతికూల ప్రభావం పడుతుంది.
జంక్ ఫుడ్: కొవ్వు అధికంగా ఉండే ఈ ఆహారంతో రుతుస్రావపు నొప్పి అధికం అవుతుంది.
పంచదార: చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల తీరు మారిపోతుంది.
పాలపదార్థాలు: వీటివల్ల అజీర్తి సమస్యలతో పాటు కండరాల నొప్పులు ఎక్కువ అవుతాయి.
మద్యం: హార్మోన్ల మీద ప్రతికూల ప్రభావం చూపే మద్యపానంతో కండరాల నొప్పులు అధికమై నిస్సత్తువ పెరుగుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

