Health Tips | తెల్ల వెంట్రుకను పీకేస్తే.. మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయా ?
Health Tips | ఒక వయసు వచ్చాక కేశాల క్లేశాలు మొదలవుతాయి. యంగ్ ఏజ్‌లో మెరిసిన జుట్టు నడి వయసుకు రాగానే నెరసిపోతూ కలవరపెడుతుంది.
Health Tips | ఒక వయసు వచ్చాక కేశాల క్లేశాలు మొదలవుతాయి. యంగ్ ఏజ్‌లో మెరిసిన జుట్టు నడి వయసుకు రాగానే నెరసిపోతూ కలవరపెడుతుంది. తెల్లబడుతున్న నల్లజుట్టును కాపాడుకోలేక, రాలిపోతున్న తెల్లజుట్టును నిలుపుకోలేక పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో రకరకాల అనుమానాలు వస్తుంటాయి. కింద పేర్కొన్న నిజాలు తెల్లజుట్టును నల్లగా మార్చకపోయినా.. మనిషికైతే భరోసానిస్తాయి.
- ఓ తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయని అపోహపడుతుంటారు. అందులో నిజం లేదు. నిజానికి ఒక వెంట్రుకను తీసేయడం దాని చుట్టుపక్కల కుదుళ్ల మీదగానీ, వేరే వెంట్రుకలు తెల్లబడటం మీద ప్రభావం చూపదు.
- తీవ్రమైన ఒత్తిడి వల్ల జుట్టు చాలా తొందరగా తెల్లబడుతుందనేది కూడా అపోహే. కాకపోతే దీర్ఘకాలం ఒత్తిడి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అందులో జుట్టు నెరవడం ఒకటి. అయినా, దీనికి శాస్త్రీయమైన రుజువులు మాత్రం లేవు.
- నెరుపు అనేది జన్యువులు, పరిసరాల కారణంగా తలెత్తే సంక్లిష్టమైన ప్రక్రియ. వీటి తర్వాతే ఒత్తిడి పాత్ర వస్తుంది.
- హెయిర్ డైలు వాడటం వల్ల జుట్టు నెరిసే క్రమం వేగవంతం అవుతుందనేది కూడా అపోహే! జుట్టు రంగుకు కారణమయ్యే మెలనోసైట్ల ఉత్పత్తికి సంబంధించిన శరీర క్రియల మీద హెయిర్ డైలు ఏ విధంగానూ ప్రభావం చూపవు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

