రుచిమొగ్గల రహస్యం!
మీ నాలుక మీద చిన్నచిన్న బొడిపెల్లాంటి వాటిని ఎప్పుడైనా గమనించారా? వీటిని చాలామంది రుచిమొగ్గలు అనుకుంటారు. కానేకాదు. రుచిమొగ్గలను సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. చర్మం బయటిపొర నుంచి పొడుచుకువచ్చినట్టుండే ఈ నిర్మాణాన్ని వైద్య పరిభాషలో ‘పాపిలే’ అంటారు.
మీ నాలుక మీద చిన్నచిన్న బొడిపెల్లాంటి వాటిని ఎప్పుడైనా గమనించారా? వీటిని చాలామంది రుచిమొగ్గలు అనుకుంటారు. కానేకాదు. రుచిమొగ్గలను సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. చర్మం బయటిపొర నుంచి పొడుచుకువచ్చినట్టుండే ఈ నిర్మాణాన్ని వైద్య పరిభాషలో ‘పాపిలే’ అంటారు. రుచిమొగ్గలు వీటిలోపల ఉంటాయి. ఒక్క నాలుకమీదే కాదు.. నోరు, అన్నవాహిక తదితర భాగాల్లోనూ ఉంటాయి. రుచిమొగ్గల్లో వేరు వేరు అంటూ ఉండవు. వివిధ రుచులకు స్పందించే విభిన్న కణాలు సమాహారం ఇది.
వీటి సాయంతో తీపి, పులుపు, ఉప్పు, వగరు రుచులను గుర్తిస్తాం. కారం రుచి కానేకాదు. మిరపకాయ ఘాటుకు మన ప్రతిస్పందన మాత్రమే. నాలుక మీదుండే ప్రతీ రుచిమొగ్గ ఈ కణాల మిశ్రమంగా ఉంటుంది. మనం ఏదైనా తిన్నప్పుడు రుచిమొగ్గల్లోని రుచి గ్రాహకాలు
మెదడుకు సంకేతాలను పంపిస్తాయి. అలా మనం రుచిని గుర్తిస్తాం. ఎక్కువ వేడి, మసాలాలు, ఆమ్లత్వం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, పొగతాగడం, కొన్ని రకాలైన వ్యాధులు, కొన్ని ఔషధాలు, కీమోథెరపీ లాంటివి రుచిమొగ్గల్ని చంపేస్తాయి.
విటమిన్-బి12 లోపం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇతర లోపాలు కూడా రుచిమొగ్గల మీద దుష్ప్రభావం చూపుతాయి. దీంతో రుచుల్ని తెలుసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో కొన్ని రోజుల్లోనే రుచిమొగ్గలు మళ్లీ పుట్టుకొస్తాయి. వీటికి సమస్య వచ్చినప్పుడు.. ఓ మోస్తరు వేడిగా ఉన్న ఆహారమే తీసుకోవాలి. మరీ చల్లగానూ ఉండకూడదు. ఘాటైన మసాలాలూ వద్దు. అయినా, రుచి తెలియకపోతే డాక్టర్లను సంప్రదిస్తే మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

