HomeHealthWhen To Drink Carrot And Beetroot Juice For Skin Whitening
Health Tips | ఈ రెండు దుంపలతో చేసిన జ్యూస్ ముందు ఎంతటి ఎనర్జీ డ్రింకైనా దిగదుడుపే!
క్యారెట్, బీట్రూట్... రెండూ దుంపలే. పోషకాల్లో దిట్టలే! మరి ఈ రెండిటి కలయికతో చేసిన జ్యూస్ పుచ్చుకుంటే... ఎంతటి ఎనర్జీ డ్రింక్ అయినా దిగదుడుపే అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకు కారణాలూ చెబుతున్నారు.
Health Tips | క్యారెట్, బీట్రూట్… రెండూ దుంపలే. పోషకాల్లో దిట్టలే! మరి ఈ రెండిటి కలయికతో చేసిన జ్యూస్ పుచ్చుకుంటే… ఎంతటి ఎనర్జీ డ్రింక్ అయినా దిగదుడుపే అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకు కారణాలూ చెబుతున్నారు.
ఈ జ్యూస్ రక్తపోటును అదుపులో ఉంచుతుందని, బీట్రూట్లోని నైట్రేట్స్ రక్తనాళాలను తెరిచి గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణుల భరోసా.
రెండిటిలోనూ లభించే యాంటీఆక్సిడెంట్స్ వల్ల కీళ్ల నుంచి ఊపిరితిత్తుల వరకు వాపునకు (ఇన్ఫ్లమేషన్) సంబంధించిన సమస్యలు రావు.
బీట్రూట్, క్యారెట్లలో పీచుపదార్థం ఎక్కువ. దాంతో జీర్ణసంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ఉదరంలో మంచి బ్యాక్టీరియా బలపడుతుంది.
ఇందులోని పోషకాలతో పాటు విటమిన్-ఎ, సి రోగ నిరోధకశక్తిని పెంచి… ఇన్ఫెక్షన్లను తరిమికొడతాయి.
ఈ రెండిటికీ కూడా సహజమైన డీటాక్స్ గుణం ఉంది. దానివల్ల ఇది కాలేయం లాంటి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ జ్యూస్‌తో చర్మపు రంగు మెరుగుపడుతుందనీ… ఓ కొత్త మెరుపు వస్తుందనీ అంటారు.
రోజూ తగిన మోతాదులో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే అనేకానేక లాభాలలో ఇవి కొన్ని. అలాగని హద్దులు మీరితే షుగర్ స్థాయి పెరగడం, మూత్రం ఎరుపు రంగులోకి మారడం లాంటి సమస్యలు రావచ్చు.