సర్జరీ తర్వాత ఏం తినాలి?
నా వయసు యాభై. అధిక బరువు కారణంగా బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాను. దాంతో కొంత కొంత మాత్రమే తినగలుగుతున్నా. అయితే ఈ మధ్య విపరీతమైన నీరసం, తలతిరగడం, చిరాకు, కాళ్లు పట్టేయడం.
నా వయసు యాభై. అధిక బరువు కారణంగా బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాను. దాంతో కొంత కొంత మాత్రమే తినగలుగుతున్నా. అయితే ఈ మధ్య విపరీతమైన నీరసం, తలతిరగడం, చిరాకు, కాళ్లు పట్టేయడం.. తదితర సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ సర్దుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. నేను శాకాహారిని.
ఓ పాఠకురాలు
కొంచెమే తిన్నా ఎక్కువ సార్లు తినడం ద్వారా మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ప్రతి రెండు గంటలకు ఏదో ఒక ఆహారం తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఈ మూడిట్లోనూ ప్రొటీన్ ఉండేలా చూసుకోండి. శాకాహారి కాబట్టి లంచ్‌లో పనీర్ కర్రీ, డిన్నర్లో రాజ్మా, శెనగలు లాంటివి ప్లాన్ చేసుకోండి.
మధ్యమధ్యలో స్నాక్స్ రూపంలో పండ్లు, సలాడ్లు తినండి. అలాగే క్యారెట్, బీట్రూట్, మిక్డ్స్ వెజిటెబుల్.. ఇలా తీసుకోండి. గుడాల్లాంటివి తిన్నా మంచిదే. మొత్తంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు ప్రొటీన్ల్లు, కార్బొహైడ్రేట్ల కలగలుపుగా ఉండేలా మీ డైట్‌ప్లాన్ తీర్చిదిద్దుకోండి. కొద్ది రోజుల్లోనే మీ సమస్య తప్పక పరిష్కారం అవుతుంది.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@ gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

