Acne | మహిళల్లో అధికంగా వచ్చే మొటిమల సమస్యకు కారణాలు ఇవే.. ఏం చేయాలంటే..?
చాలా మందిని వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. మొటిమలు అనేవి కేవలం యుక్త వయస్సులోనే వచ్చే సమస్య మాత్రమే కాదు. ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళల్లో కూడా అకస్మాత్తుగా మొటిమలు రావడం పెరుగుతోంది. ముఖ్యంగా దవడల లైన్, గడ్డం, చెంపల దిగువ భాగంలో వచ్చే ఈ మొటిమలకు జీవనశైలి ప్రధాన కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Acne | చాలా మందిని వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. మొటిమలు అనేవి కేవలం యుక్త వయస్సులోనే వచ్చే సమస్య మాత్రమే కాదు. ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళల్లో కూడా అకస్మాత్తుగా మొటిమలు రావడం పెరుగుతోంది. ముఖ్యంగా దవడల లైన్, గడ్డం, చెంపల దిగువ భాగంలో వచ్చే ఈ మొటిమలకు జీవనశైలి ప్రధాన కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి అంశాలు హార్మోన్లపై ప్రభావం చూపి చర్మ సమస్యలకు దారితీస్తాయని సూచిస్తున్నారు. మహిళలు చక్కెర, పాలు తగ్గించినా, శుభ్రమైన ఆహారం తీసుకున్నా, పీసీఓడీ లేదా ఇతర హార్మోన్ సమస్యలు లేకపోయినా మొటిమలు తగ్గడం లేదని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి కారణం కేవలం మురికి ఫోన్, దిండుపై కవర్ లేదా మేకప్ కాదని నిపుణులు వివరిస్తున్నారు. ఇవి సమస్యను మరింత పెంచవచ్చేమోగానీ, అసలు మూలకారణం హార్మోన్ల అసమతుల్యతతో కూడిన జీవనశైలేనని అంటున్నారు.
ఈ భాగాల్లో ఎక్కువ..
ప్రత్యేకంగా మహిళల్లో దవడల లైన్, గడ్డం ప్రాంతంలో వచ్చే మొటిమలకు హార్మోనల్ యాక్నే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నెలసరి సక్రమంగా ఉన్నా, వైద్య పరీక్షల్లో ఎలాంటి సమస్యలు కనిపించకపోయినా శరీరంలో జరిగే సూక్ష్మ హార్మోన్ మార్పులు చర్మంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక మానసిక ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం, సరైన నిద్ర లేకపోవడం, బరువు పెరగడం, అధికంగా పాలు తీసుకోవడం, ప్రోటీన్, చక్కెర తీసుకోవడం వంటి జీవనశైలి అలవాట్లు మొటిమలు ఎక్కువగా రావడానికి కారణాలని వారు చెబుతున్నారు. ఈ అలవాట్లు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి మొటిమలను ప్రేరేపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
ఆ ఉత్పత్తులు పనిచేస్తాయా..?
ఇక కొరియన్ స్కిన్‌కేర్ ఉత్పత్తుల గురించి కూడా చర్మ నిపుణులు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. చర్మానికి తగిన తేమ, మాయిశ్చరైజేషన్ ఇవ్వడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని అంటున్నారు. అయితే తీవ్రమైన పిగ్మెంటేషన్, మెలాస్మా, లోతైన మొటిమ మచ్చలు లేదా పెద్ద రంధ్రాల సమస్యలుంటే కేవలం కొరియన్ స్కిన్‌కేర్ సరిపోదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యల కోసం గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ లేదా వైద్యులు సూచించే రెటినాయిడ్ల వంటి చికిత్సలు అవసరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Acne
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

