నడక-యోగ ఏది మంచిది?
వ్యాయామం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి.. వాకింగ్, యోగ! పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. అయితే, ఈ రెండిటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఏది ఎంచుకోవాలి? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు ఇస్తున్నారు.
వ్యాయామం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి.. వాకింగ్, యోగ! పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. అయితే, ఈ రెండిటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఏది ఎంచుకోవాలి? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు ఇస్తున్నారు.
మార్నింగ్ వాక్, యోగ.. రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే! అయితే, ఈ రెండిటి వల్ల కలిగే ప్రయోజనాలు, శరీరంపై చూపించే ప్రభావాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి, మీ శరీర అవసరాలు, ఆరోగ్యం, ఆశయాలను బట్టి ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు.
మార్నింగ్ వాక్: ఇది అద్భుతమైన కార్డియో వ్యాయామం. శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి.. నడక అనేది చాలా తేలికైన, ప్రభావవంతమైన మార్గం కూడా. మార్నింగ్ వాక్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కేలరీలు వేగంగా కరిగిపోతాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. టైప్-2 మధుమేహం ఉన్నవారు మార్నింగ్ వాక్ చేస్తే.. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఉదయాన్నే స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మూడ్ మెరుగుపడుతుంది.
యోగ: యోగాభ్యాసం అంటే.. ఒక వ్యాయామం మాత్రమే కాదు. అది శరీరం, మనసు, శ్వాసల కలయిక. యోగాసనాల వల్ల కండరాలు, నరాలు సాగి.. శరీరం సరళంగా, చురుగ్గా తయారవుతుంది. జీవనశైలి లోపాల వల్ల వచ్చే నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రాణాయామం, ధ్యానం వల్ల ఒత్తిడి, ఆందోళన పూర్తిగా తగ్గి, ఏకాగ్రత, నిద్ర లేమి సమస్యలు దూరమవుతాయి. వివిధ ఆసనాలు వేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హార్మోన్ల సమతుల్యత సాధ్యమవుతుంది. నిటారుగా కూర్చోవడం, నిలబడటంలో శరీర ఆకృతి మెరుగుపడుతుంది.

ఎవరికి ఏది మంచిది?
బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, రక్తపోటు-షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం మీ ప్రధాన లక్ష్యమైతే.. మార్నింగ్ వాక్ ఎంచుకోవడం మంచిది. ఇక ఒత్తిడి, శారీరక నొప్పుల నుంచి ఉపశమనం, ఫ్లెక్సిబిలిటీ, ప్రశాంతత కావాలనుకుంటే.. యోగాను ఆశ్రయించాలి. వీలైతే.. వారంలో మూడు నాలుగు రోజులు మార్నింగ్ వాక్, మిగతా రోజులు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంకా మెరుగైన ఫలితాలు కావాలనుకుంటే.. ఉదయం 15-20 నిమిషాలు వాకింగ్ చేసి, మరో 15 నిమిషాలు తేలికపాటి యోగాసనాలు వేస్తే సరిపోతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

