జుట్టు కోసం.. కూరగాయలతో జట్టు !
సమతుల ఆహారంతో పాటు పోషకాలు నిండుగా ఉన్న ఆకుకూరలు, కూర గాయలు, పండ్లు తీసుకుంటే కురుల ఆరోగ్యానికి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు
సమతుల ఆహారంతో పాటు పోషకాలు నిండుగా ఉన్న ఆకుకూరలు, కూర గాయలు, పండ్లు తీసుకుంటే కురుల ఆరోగ్యానికి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
- పాలకూర: ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-సి, కెరోటినాయిడ్స్, రాగి లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టుకు ఎంతో మేలుచేస్తాయి.
- బీట్రూట్: కేశాల పెరుగుదలకు సహకరించే మరో మంచి ఆహారం బీట్రూట్. ఇది శరీరంలో ఐరన్ స్థాయులను పెంచి జుట్టు రాలిపోకుండా నిరోధిస్తుంది.
- దోసకాయ: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇది జుట్టు కుదుళ్లకు పోషణనిస్తుంది. దోసకాయ రసాన్ని నీళ్లు, పుదీనా ఆకులు, నిమ్మరసంతో కలుపుకొని తాగితే మరీ మంచిది.
- ఉసిరికాయ: దీనిలో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర కణజాలం నశించి పోవడాన్ని తగ్గిస్తుంది. కొత్తగా జుట్టు పెరిగేలా చేస్తుంది.
- నారింజ: ఈ పండులో విటమిన్-సి, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగు దలకు హామీగా నిలుస్తాయి.
- స్ట్రాబెర్రీ: ఫోలేట్, విటమిన్-బి9, విటమిన్-సి, మాంగనీస్, బయోటిన్, ఒమేగా-3, పొటాషియం లాంటి పోషకాలకు చిరునామా.
- క్యారెట్: ఇందులో విటమిన్- ఎ, ఇ ఉంటాయి. ఇవి కుదుళ్లకు పోషణనిచ్చి, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

