అహ్మదాబాద్ : గత కొన్నేండ్లుగా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఛాయిస్‌గా పలువురు అవకాడోను ఎంచుకుంటున్నారు. టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి అవకాడో మేలు చేస్తుండటంతో అవకాడోతో చేసిన రెసిపీలను ఇష్టంగా తినేందుకు పలువురు మొగ్గుచూపుతున్నారు. అవకాడోల్లో ఆరోగ్యకర కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు జీర్ణశక్తి మెరుగయ్యేందుకు ఉపకరిస్తుంది.
అవకాడో తరచూ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇక రెస్టారెంట్లు సైతం తమ మెనూల్లో అవకాడో డిష్‌లను చేర్చాయి. స్ట్రీట్ ఫుడ్ వెండార్లు సైతం అవకాడో టోస్ట్‌ను విక్రయిస్తున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత అవకాడో టోస్ట్‌ను ఆఫర్ చేస్తున్న వీడియో (Viral Video) వైరల్‌గా మారింది.
View this post on Instagram
A post shared by DIVYA | Vadodara Food & Lifestyle Blogger (@thesavouryspree)
వడోదరకు చెందిన ఫుడ్ బ్లాగర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఎంతో శుచిగా, రుచిగా అవకాడో టోస్ట్‌ను స్ట్రీట్ ఫుడ్ విక్రేత రెడీ చేస్తుండటం పలువురిని ఆకట్టుకుంది. గ్లోవ్స్ ధరించి కుక్ ఎన్నో ప్రికాషన్స్, ప్రిపరేషన్‌తో ఫుడ్‌ను సిద్ధం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక, ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 1.6 లక్షల మందిపైగా వీక్షించారు.
Read More :