బాబు వయసు పద్దెనిమిది నెలలు. ఆరునెలల్లో మూడోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇవ్వగానే తగ్గిపోతున్నది. ఒకటిరెండు నెలలకు మళ్లీ వస్తున్నది. ఈ సమస్య పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? l ఓ
పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ సాధారణమే. కానీ పదేపదే ఇబ్బంది పెడుతుంటే మాత్రం, ఎందుకు ఇలా జరుగుతున్నది అని ప్రశ్నించుకోవాలి. మూత్రపిండాలలో తయారైన మూత్రం, మూత్రనాళాల ద్వారా మూత్రాశయానికి చేరుతుంది. అక్కడి నుంచి బిడ్డ విసర్జిస్తుంది. ఆ మూత్రం మళ్లీ వెనక్కి వెళ్లిపోకుండా మూత్రనాళాలలోని కొన్ని కవాటాలు రక్షిస్తాయి. అలా
జరగకపోతే మాత్రం అనారోగ్య సంకేతమే. దీన్నే యూరిన్ ఇన్ఫెక్షన్గా వ్యవహరిస్తాం. అల్ట్రాసౌండ్ స్కాన్, మిక్చ్యురేటింగ్ సిస్టో యురిత్రోగ్రామ్ (ఎంసీజీ) చేయించండి. పరీక్షలో యూరిన్ ఇన్ఫెక్షన్గా నిర్ధారణ అయితే, ఆలస్యం చేయకుండా పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ను సంప్రదించడం ఉత్తమం. కొన్నిసార్లు మలబద్ధకం వల్ల సమస్య రావచ్చు. మూత్రాశయం, మూత్రనాళం మొదలైన వాటిలో లోపాలవల్ల కూడా ఇన్ఫెక్షన్ తలెత్తవచ్చు.
డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్