మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు
మహిళల్లో మూత్ర సంబంధమైన సమస్యలు చాలా ఎక్కువ. పురుషులతో పోలిస్తే మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశమూ ఎక్కువే. మహిళల దేహనిర్మాణ పరమైన (అనటామికల్) ప్రత్యేకతలే ఇందుకు కారణం. మహిళల్లో మూత్రనాళం చిన్నగా ఉంటుంది.
మహిళల్లో మూత్ర సంబంధమైన సమస్యలు చాలా ఎక్కువ. పురుషులతో పోలిస్తే మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశమూ ఎక్కువే. మహిళల దేహనిర్మాణ పరమైన (అనటామికల్) ప్రత్యేకతలే ఇందుకు కారణం. మహిళల్లో మూత్రనాళం చిన్నగా ఉంటుంది. అంతేకాదు.. అది వారి జననేంద్రియాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ తరహా ఇన్ఫెక్షన్లు ఎక్కువ. మహిళల్లో వచ్చే మూత్రసంబంధ సమస్యల్లో.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ కాంటినెన్స్ (చిన్నచిన్న కారణాలతో.. అంటే దగ్గినప్పుడు, నవ్వినప్పుడు తమ ప్రమేయం లేకుండానే మూత్రం కారిపోతూ ఉండటం), మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువైతే మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంది. ఇది కేవలం ఇన్ఫెక్షన్తో వచ్చే లక్షణమే అయినప్పటికీ, ఎక్కువ భయాందోళనకు గురిచేస్తుంది.
మహిళల్లో ఎక్కువగా కనిపించే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఇవీ..
- కొత్తగా పెళ్లయిన మహిళల్లో హనీమూన్ సిస్టయిటిస్ అనే సమస్యతో మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో ఇన్ఫెక్షన్లు సాధారణం.
- మధ్యవయసు మహిళల్లో (పోస్ట్ మెనోపాజల్ ఉమన్) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. నెలసరి ఆగిపోయాక వచ్చే హార్మోన్ల లోపమే ఇందుకు కారణం. ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపం వల్ల మూత్రనాళంలోని లోపలి పొర సన్నబడే అవకాశం ఉంటుంది. ఫలితంగా బ్యాక్టీరియా పేరుకుపోయి.. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఇన్ఫెక్షన్లలో కొన్ని..
- మూత్రంలో ఇన్ఫెక్షన్లు రకరకాలుగా రావచ్చు. మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్లను ‘యురెథ్రైటిస్’ అంటారు. మూత్రాశయంలోని ఇన్ఫెక్షన్లను ‘సిస్టయిటిస్’ అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను ‘పైలోనెఫ్రైటిస్’ అంటారు.
- మొదటిసారి మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అనీ, మళ్లీమళ్లీ రావడాన్ని ‘పర్సిస్టెంట్ బ్యాక్టీరియోరియా’ లేదా ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్’ అని అంటారు. మొదటిసారి వచ్చే ఇన్ఫెక్షన్ల కోసం ప్రత్యేకమైన పరీక్షలేమీ అవసరం లేదు. కానీ మళ్లీమళ్లీ వస్తుంటే మాత్రం.. కారణం ఏమిటో తెలుసుకోవాలి.
- మూత్రవిసర్జక వ్యవస్థలో పుట్టుకతో వచ్చే లోపాల కారణంగా తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటే.. శస్త్రచికిత్స ద్వారా సరిచేయవచ్చు. ఒక్కోసారి మూత్రావయవాలలో టీబీ వల్ల కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు టీబీ చికిత్స తీసుకోవాలి.
నిర్ధారణ పరీక్షలు
- మూత్రంలో మాటిమాటికీ ఇన్ఫెక్షన్ వచ్చేవారికి సాధారణ పరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొన్ని ప్రత్యేకమైన ఎక్స్-రే (ఐవీయూ, ఎంసీయూజీ లాంటివి) చేయాల్సి ఉంటుంది.
- మూత్రవిసర్జక వ్యవస్థలో టీబీ ఉంటే దాని నిర్ధారణకు ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేయాల్సి ఉంటుంది.
గర్భిణుల్లో యూరినరీ సమస్యలు..
గర్భిణుల్లోనూ మూత్రంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. గర్భధారణ సమయంలో గర్భసంచి పెరుగుతున్నకొద్దీ.. అది మూత్రనాళాలపై ఒత్తిడి కలగజేస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు వాచిపోతాయి. దాంతో మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్.. మూత్రపిండాలకూ చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. కొందరిలో నెలలు నిండకముందే ప్రసవం కూడా కావచ్చు. అందువల్ల గర్భిణులు మూత్రపరీక్ష చేయించుకుని, ఇన్ఫెక్షన్ ఉంటే మందులు తప్పకుండా వాడాల్సి ఉంటుంది.
ఇన్ఫెక్షన్కు చికిత్స
సాధారణంగా వచ్చే సిైస్టెటిస్కు మూడు రోజులపాటు యాంటీబయాటిక్స్ కోర్సు సరిపోతుంది. మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లయితే.. దీర్ఘకాలంపాటు చికిత్స అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో దీర్ఘకాలంపాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇక కొందరిలో మూత్రపిండాలలో రాళ్లను తొలగించడం కోసం కొన్ని నాన్‌సర్జికల్, సర్జికల్ ప్రొసీజర్స్ అవసరం కావచ్చు.
– డాక్టర్ సరోజ .బి అబ్‌స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్, ఎల్బీనగర్, హైదరాబాద్ ఫోన్: 8882 046046 www.rainbowhospital.in
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

