Anti Inflammatory Shot | ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్‌తో మెరిసే చర్మం, ఆరోగ్యం సొంతం
యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్‌తో (Anti Inflammatory Shot) అద్భుత ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ నేహ పరిహర్ తన ఇన్స్టాగ్రాం పేజ్ గ్రోవిత్నేహలో రాసుకొచ్చారు.
న్యూఢిల్లీ : నేటి ఆధునిక జీవితంలో లేచింది మొదలు ఉరుకుల పరుగుల పనితో ఒత్తిడితో చిత్తవుతుంటాం. ఒత్తిడితో శారీరక అలసట, మానసిక అలజడితో వ్యాధుల బారినపడే ముప్పు అధికమని వైద్యులు హెచ్చరిస్తున్నా జీవనోపాధి కోసం పరుగులు పెట్టడం మానలేం. అయితే జీవనశైలి మార్పులతో, ఆరోగ్యకర ఆహారంతో ఒత్తిడిని చిత్తు చేసి మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్‌తో (Anti Inflammatory Shot) అద్భుత ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ నేహ పరిహర్ తన ఇన్స్టాగ్రాం పేజ్ గ్రోవిత్నేహలో రాసుకొచ్చారు. రోజూ మనం వాడే నిమ్మరసం, ఆరంజ్, అల్లంతో ఈ డీటాక్స్ డ్రింక్‌ను తయారుచేసుకోవచ్చని నేహ చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ జ్యూస్ ప్యాక్‌లో కేవలం 25 క్యాలరీలే ఉంటాయని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
ఈ డీటాక్స్ డ్రింక్ తయారుచేసే విధానం చూస్తే ఉసిరి, ఆరంజ్, నిమ్మకాయ రసాన్ని తీసుకుని అందులో అల్లం రసం, మిరియాల పొడి, పసుపుని మిక్స్ చేసి యాంటీఆక్సిడెంట్ డ్రింక్ తయారుచేసుకుని ఉదయాన్నే తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నేహ చెబుతున్నారు. ఈ డ్రింక్‌తో చర్మం సహజంగా మెరవడంతో పాటు చర్మంపై మచ్చలు తొలగిపోవడమే కాకుండా కేశ సంరక్షణకూ ఇది ఉపయోగపడుతుంది. ఇక శరీరంలో ఇన్ఫ్లమేషన్తో ఇది పోరాడి మన రోగనిరోధక వ్యవస్ధనూ బలోపేతం చేస్తుంది.
Read More :
Spirit Of Fighter | ఫైటర్ సూపర్ స్టైలిష్ లుక్ వైరల్.. Patty పాత్రలో హృతిక్ రోషన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

