Travelling with diabetes: మీకు డయాబెటిస్ ఉందా? టూర్ వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ప్రయాణాలు చేయడం చాలామందికి సరదా. కానీ, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ప్రయాణాలకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నోరుకట్టుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది కొద్దిరోజుల ట్రిప్ అయినా సరే ఆహారం, ఇతర విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. టూర్లకు వెళ్లేటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు తమను తాము సిద్ధం చేసుకోవాలని, ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెరస్థాయిలు కంట్రోల్లో ఉంచుకునేందుకు కొన్ని టిప్స్ చెప్పారు.

- రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రోజువారీగా చెక్ చేసుకోవాలి.
- ట్రిప్ మొత్తం బాడీ హైడ్రేట్‌గా ఉండేలా తగినంత నీరు తాగాలి. స్వచ్ఛమైన నీటిని వెంట తీసుకెళ్లాలి.
- స్నాక్స్, ఆహారాన్ని ఇంటినుంచే తీసుకెళ్లాలి. బయట దొరికే ఆహారపదార్థాల జోలికి అస్సలు వెళ్లొద్దు.
- రోజూ వేసుకోవాల్సిన మందులు, ప్రిస్క్రిప్షన్, డయాబెటిస్ టెస్టింగ్ కిట్, ఇన్సులిన్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
- వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించొచ్చు. ప్రయాణ సమయంలో విరామం దొరికినప్పుడు చిన్న చిన్న వర్కౌట్స్ చేయాలి. శరీరాన్ని అతిగా ఇబ్బంది పెట్టొద్దు.
- రిమైండర్ సెట్ చేసుకొని, సమయానికి మందులు వేసుకోవాలి.
- రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు రక్తంలో చక్కెరస్థాయిలను పెంచే ఆహారం ఆర్డర్ ఇవ్వొద్దు. మెనూని తనిఖీ చేసి, ఆరోగ్యకరమైన ఐటమ్స్ మాత్రమే తినాలి.
- మీరు వెళ్తున్న ప్రదేశంలో సమీపాన ఉన్న ఫార్మసీలు, దవాఖానల జాబితా రూపొందించుకోవాలి.
- మెడికల్ ఐడీ బ్రాస్లెట్ను తప్పక ధరించండి. మీ ఆరోగ్యం, అలెర్జీలు మొదలైన వాటికి సంబంధించిన ఐడీ, ఇతర సమాచారం అందులో ఉండేలా చూసుకోండి.
ప్రయాణానికి ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!