Tongue Tie | టంగ్ టైతో జన్మించేవారికి శస్త్రచికిత్స అవసరమా?
కొందరు శిశువులు టంగ్ టైతో జన్మిస్తుంటారు. ఇది మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గర్భస్థ శిశువు నాలుగు వారాలున్నప్పుడు నాలుక ఏర్పడుతుంది. నాలుక నిర్మాణ క్రమంలో నోటి కింది భాగానికీ, నాలుకకు ఒక బ్యాండ్ లాంటి కనెక్షన్ ఉంటుంది.
Tongue Tie | కొందరు శిశువులు టంగ్ టైతో జన్మిస్తుంటారు. ఇది మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గర్భస్థ శిశువు నాలుగు వారాలున్నప్పుడు నాలుక ఏర్పడుతుంది. నాలుక నిర్మాణ క్రమంలో నోటి కింది భాగానికీ, నాలుకకు ఒక బ్యాండ్ లాంటి కనెక్షన్ ఉంటుంది. నాలుక నిర్మాణం పూర్తయ్యే సరికి ఈ కనెక్షన్ నాలుక మధ్యభాగంలోకి వెళ్లిపోతుంది. కొన్ని కేసుల్లో ఇది నాలుక ముందు భాగంలోనే ఉంటుంది. దీన్నే టంగ్ టై అంటారు. దీనివల్ల నాలుకను సులభంగా కదపలేరు. నాలుకను ముందుకు చాపలేకపోతారు.
తల్లిపాలు తాగడానికి ఇబ్బందిపడతారు. మాటలు కూడా ఆలస్యంగా రావొచ్చు. కొన్ని పదాలు అస్పష్టంగా పలుకుతుంటారు. తినడానికీ ఇబ్బందిపడతారు. టంగ్ టై మందంగా ఉన్నట్టయితే శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ఇది చిన్నప్పుడే చేయడం మంచిది. దీనివల్ల పిల్లలు తల్లిపాలు సులభంగా తాగగలుగుతారు. సరైన వయసులో మాట్లాడటం మొదలుపెడతారు. అయితే, కొందరిలో ఈ టంగ్ టై పొరలా.. సన్నగా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలు పెరిగే క్రమంలో ఆ కనెక్షన్ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్లకు సర్జరీ వెంటనే చేయాల్సిన అవసరం లేదు. వైద్యుడి సలహా మేరకు నడుచుకోవడం అవసరం. శస్త్రచికిత్స వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

