Tongue Color | నాలుకపై కనిపించే రంగు, మచ్చలను బట్టి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో ఇలా చెప్పవచ్చు
మన శరీరంలో ఏదైనా సమస్య ప్రారంభమైతే ముందుగా కొన్ని చిన్న సంకేతాల రూపంలో కనిపిస్తుంది. ఇలా సంకేతాలను చూపించే వాటిలో నాలుక కూడా ఒక ముఖ్యమైన సూచికగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నాలుక రంగు, పైపొర, ఆకారం, మచ్చలు వంటి మార్పులు శరీర ఆరోగ్య పరిస్థితిపై సంకేతాలు ఇవ్వగలవని వైద్యులు సూచిస్తున్నారు.
Tongue Color | మన శరీరంలో ఏదైనా సమస్య ప్రారంభమైతే ముందుగా కొన్ని చిన్న సంకేతాల రూపంలో కనిపిస్తుంది. ఇలా సంకేతాలను చూపించే వాటిలో నాలుక కూడా ఒక ముఖ్యమైన సూచికగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నాలుక రంగు, పైపొర, ఆకారం, మచ్చలు వంటి మార్పులు శరీర ఆరోగ్య పరిస్థితిపై సంకేతాలు ఇవ్వగలవని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా నిర్లక్ష్యం చేసే ఈ మార్పులు కొన్నిసార్లు పోషకాహార లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన నాలుక సాధారణంగా లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇది సరైన పోషకాహారం, తగినంత నీరు తీసుకోవడం, మంచి నోటి పరిశుభ్రతను సూచిస్తుంది. పలుచని తెల్లటి పొర ఉండటం సహజమని నిపుణులు చెబుతున్నారు.
ఐరన్, విటమిన్ బి12 లోపం ఉంటే..
నాలుక చాలా పలుచగా లేదా తెల్లగా కనిపిస్తే అది ఐరన్ లోపం, విటమిన్ బి12 కొరత లేదా రక్తహీనతకు సంకేతం కావచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలిక అలసట లేదా శరీరంలో శక్తి లోపాన్ని కూడా ఇది సూచిస్తుందని చెబుతున్నారు. నాలుకపై మందమైన తెల్లని పొర కనిపిస్తే అది నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, డీహైడ్రేషన్, ధూమపానం వంటి కారణాలతో అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్, ఐరన్ లేదా విటమిన్ బి12 లోపం వంటి సమస్యలకు కూడా ఇది సంకేతం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. నాలుకపై పసుపు రంగు పొర కనిపించడం సాధారణంగా మృత కణాలు, బ్యాక్టీరియా లేదా ఆహార అవశేషాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఇది ఎక్కువగా తాత్కాలికమే అయినప్పటికీ, కొన్నిసార్లు జీర్ణ సమస్యలు లేదా జాండిస్ వంటి సమస్యలకు కూడా సూచనగా భావించాలి.
నాలుక గాఢ ఎరుపు రంగులో ఉంటే..
అలాగే నాలుక గాఢ ఎరుపు లేదా స్ట్రాబెర్రీ రంగులో కనిపిస్తే అది విటమిన్ బి12 లోపం లేదా వాపుకు సంకేతం అవుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా స్కార్లెట్ ఫీవర్, కవాసాకి వ్యాధి వంటి సమస్యల్లో కూడా ఇలా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంతమందిలో నాలుకపై మ్యాప్‌లా కనిపించే ఎర్రని మచ్చలు ఉంటాయి. దీనిని జియోగ్రాఫిక్ టంగ్ అని అంటారు. ఇది సాధారణంగా హానికరం కాదు, అంటువ్యాధి కూడా కాదు. అయితే ఒత్తిడి, విటమిన్ లోపాలు లేదా సోరియాసిస్ వంటి సమస్యలతో ఇది సంబంధం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నిపుణుల సూచనల ప్రకారం, నాలుకలో అసాధారణ మార్పులు కొన్ని రోజులకు మించి కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. సరైన నోటి పరిశుభ్రత, సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ద్వారా నాలుక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

