చెమట వాసనా?
చంకల్లో ఎక్కువగా చెమట పట్టడాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇబ్బంది కలిగించే ఈ సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. అతిగా చెమట పట్టడం వల్ల బట్టల మీద మరకలు, దుర్వాసన, తరచుగా బట్టలు మార్చుకోవడం మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి.
చంకల్లో ఎక్కువగా చెమట పట్టడాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇబ్బంది కలిగించే ఈ సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. అతిగా చెమట పట్టడం వల్ల బట్టల మీద మరకలు, దుర్వాసన, తరచుగా బట్టలు మార్చుకోవడం మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు ఈ సమస్య మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. హైపర్హైడ్రోసిస్కు కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులను సంప్రదించిన తర్వాతే తగిన చికిత్సను ఎంచుకోవాలి.
ప్రిస్క్రిప్షన్ స్ట్రెంత్ యాంటీ పెర్స్పిరెంట్స్: మామూలు డియోడరెంట్ల లాంటివి పనిచేయనప్పుడు డాక్టర్లను సంప్రదించాలి. వాళ్లు చంకల్లో అతి చెమటను నివారించే యాంటీ పెర్స్పిరెంట్స్ సిఫారసు చేస్తారు. వీటిలో అల్యూమినియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్ లాంటివి అత్యధిక గాఢతలో ఉంటాయి కాబట్టి, నిపుణుల సలహా మేరకే వాడాలి.
టాపికల్ యాంటీపెర్స్పిరెంట్స్: చంకల్లో అతి స్వేదం సమస్యకు టాపికల్ యాంటీపెర్స్పిరెంట్స్ తేలికగా అందుబాటులో ఉన్న చికిత్స సదుపాయాలు. వీటిలో ఉండే అల్యూమినియం క్లోరైడ్ స్వేద గ్రంథుల్ని మూసేస్తుంది. అలా ఎక్కువ చెమట వెలువడటాన్ని తగ్గిస్తుంది. టాపికల్ యాంటీపెర్స్పిరెంట్స్ను పడుకునే ముందు చంకల్లో పొడిచర్మం మీద పూతగా రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
బొటాక్స్ ఇంజెక్షన్స్: చంకల్లో చెమటకు బొట్యులినమ్ టాక్సిన్ కలిగిన బొటాక్స్ ఇంజెక్షన్స్ సమర్థమైన చికిత్స అందిస్తాయి. బొట్యులినం టాక్సిన్ చంకల్లో చెమటను ప్రేరేపించే రసాయన సిగ్నల్స్‌ను అడ్డుకుంటాయి. కొన్ని నెలలపాటు ప్రభావం చూపే బొటాక్స్
ఇంజెక్షన్లను వైద్యుడి ద్వారానే తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఇంజెక్షన్లు తీసుకుంటేనే అతి స్వేదం సమస్య నుంచి ఉపశమనం
కొనసాగుతుంది.
అయాన్టోఫోర్సిస్: ఇందులో భాగంగా నీళ్ల ద్వారాగానీ, లేదంటే తడి ప్యాడ్‌ను చంకల్లో ఉంచి ఓ మోస్తరు విద్యుత్తును చంకల్లోకి పంపిస్తారు. దీంతో స్వేద గ్రంథులు తాత్కాలికంగా పూడుకుపోతాయి. అలా అధికంగా చెమట పట్టడం నుంచి విముక్తి లభిస్తుంది. మంచి ఫలితాలు రావడానికి ఈ చికిత్సను కొన్ని వారాలకు ఒకసారి నిపుణుల పర్యవేక్షణలో చేయించుకోవాలి.
లేజర్ చికిత్స: లేజర్ అబ్లేషన్, లేజర్ లైపోలైసిస్ చంకల్లో చెమటకు మంచి చికిత్స. ఈ చికిత్సలో చంకల్లో స్వేద గ్రంథుల్ని లక్ష్యంగా చేసుకుని చికిత్స చేస్తారు. దాంతో చెమట వెలువడటం తగ్గిపోతుంది. లేజర్ థెరపీతో చర్మంపై కోత తక్కువగా ఉంటుంది (మినిమల్లీ ఇన్వేసివ్). అదే సమయంలో సమస్యకు పరిష్కారం తొందరగా దొరుకుతుంది. కానీ, లేజర్ చికిత్స మీ చర్మానికి తగిందో కాదో డాక్టర్‌ను సంప్రదించాకే నిర్ధారించుకోవాలి.
సర్జరీ ద్వారా: మామూలు చికిత్సల ద్వారా హైపర్హైడ్రోసిస్ సమస్య ఏమాత్రం తగ్గకపోతే వైద్యులు సర్జరీని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటివాటిలో ఆగ్జిలరీ స్వెట్ గ్లాండ్ సక్షన్ క్యూరెటేజ్ ఒకటి. దీని ద్వారా చంకల్లో స్వేద గ్రంథుల్ని పూర్తిగా తొలగిస్తారు. మరో చికిత్స థొరాసిక్ సింపథెక్టమీ. ఇందులో చెమట ఉత్పత్తికి మూలమైన నరాలను కత్తిరించిడం లేదా ముడివేయడం చేస్తారు. అయితే సర్జరీని చివరి అస్త్రంగా మాత్రమే ఎంచుకోవాలి. అదీ నిపుణుడిని సంప్రదించిన తర్వాతే.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

