Thyroid | థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి మేలు చేసే ఆహారాలు ఇవే..
థైరాయిడ్ గ్రంథి పరిమాణంలో చిన్నదైనా శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియ (మెటబాలిజం), శక్తి స్థాయిలు, గుండె ఆరోగ్యం, శరీర ఉష్ణోగ్రత, మానసిక స్థితి, జుట్టు ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత వంటి అంశాలు థైరాయిడ్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి.
Thyroid | థైరాయిడ్ గ్రంథి పరిమాణంలో చిన్నదైనా శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియ (మెటబాలిజం), శక్తి స్థాయిలు, గుండె ఆరోగ్యం, శరీర ఉష్ణోగ్రత, మానసిక స్థితి, జుట్టు ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత వంటి అంశాలు థైరాయిడ్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. థైరాయిడ్ సక్రమంగా పనిచేయాలంటే కొన్ని ముఖ్యమైన పోషకాలు శరీరానికి తగిన మోతాదులో అందడం అవసరం. ఈ పోషకాల లోపం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, వినియోగం, క్రియాశీలతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సెలీనియం థైరాయిడ్ గ్రంథిని రక్షించడంలో, థైరాయిడ్ హార్మోన్లను క్రియాశీల రూపంలోకి మార్చడంలో సహాయపడుతుంది. బ్రెజిల్ నట్స్, ట్యూనా చేప, సన్‌ఫ్లవర్ గింజలు, మష్రూమ్స్‌లో ఇది సమృద్ధిగా లభిస్తుంది.
అయోడిన్, ఐరన్, జింక్..
అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అత్యంత అవసరమైన ఖనిజం. అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు పచ్చి మొక్కలు (సీ వీడ్), రొయ్యలు, కాడ్ చేప, గుడ్లు మంచి వనరులు. ఐరన్ శరీరం థైరాయిడ్ హార్మోన్లను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సహకరిస్తుంది. రాజగిరా (అమరాంత్), గుమ్మడికాయ గింజలు, గుడ్డు పచ్చసొన, ఆకుకూరల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. జింక్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడటంతోపాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శనగలు, గుమ్మడికాయ గింజలు, జీడిపప్పు, హెంప్ గింజలు, ఓయిస్టర్ల ద్వారా జింక్ పొందవచ్చు. టైరోసిన్ అనే అమైనో ఆమ్లం థైరాయిడ్ హార్మోన్ల తయారీలో ఉపయోగపడుతుంది. గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, నువ్వుల గింజలు టైరోసిన్కు మంచి మూలాలు.
విటమిన్ డి, ఎ, బి విటమిన్లు..
విటమిన్ డి థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపడంతోపాటు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. సాల్మన్, సార్డిన్ చేపలు, గుడ్డు పచ్చసొన, యూవీ కిరణాలకు గురిచేసిన మష్రూమ్స్, ఫోర్టిఫైడ్ పాల ఉత్పత్తుల్లో ఇది లభిస్తుంది. మెగ్నీషియం క్రియారహిత థైరాయిడ్ హార్మోన్లను క్రియాశీల రూపంలోకి మార్చడంలో సహాయపడుతుంది. బాదం, పాలకూర, అవకాడో, బ్లాక్ బీన్స్, గుమ్మడికాయ గింజలు మంచి వనరులు. విటమిన్ ఎ థైరాయిడ్ హార్మోన్ల జీవక్రియను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిలగడదుంపలు, క్యారెట్లు, ఎర్ర క్యాప్సికం, కాలేయం (లివర్)లో ఇది సమృద్ధిగా ఉంటుంది. బి-విటమిన్లు శక్తి ఉత్పత్తి, జీవక్రియ ప్రక్రియలకు అవసరం. ఇవి థైరాయిడ్ నియంత్రించే ముఖ్యమైన శారీరక విధులకు మద్దతు ఇస్తాయి. న్యూట్రిషనల్ ఈస్ట్, పప్పుధాన్యాలు, సాల్మన్ చేప, ఆకుకూరల్లో బి-విటమిన్లు లభిస్తాయి. అయితే ఈ పోషకాలు థైరాయిడ్ ఆరోగ్యానికి ఉపయోగకరమైనప్పటికీ, ఇప్పటికే థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేయాలనుకునేవారు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

