న్యూఢిల్లీ : ఆస్టియోపొరోసిస్ నియంత్రణ, నివారణ, చికిత్సపై అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్ 20న ప్రపంచ ఆస్టియోపొరోసిస్ దినంగా (World Osteoporosis Day) పాటిస్తున్నారు. ఎముకలు, కీళ్లు క్షీణించి తరచూ ఫ్రాక్చర్లకు లోనయ్యే క్రానిక్ కండిషన్ను ఆస్టియోపొరోసిస్గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారినపడుతుండటంతో ఆస్టియోపొరోసిస్పై వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున అవగాహన చేపడుతున్నారు.
ఈ రుగ్మతను ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. ఇక భారత్ వంటి పలు దేశాల్లో శతాబ్ధాలుగా ఆయుర్వేదిక ఔషధాలను ఆస్టియోపొరోసిస్, కీళ్ల నొప్పుల నివారణకు వాడుతున్నారు.
అశ్వగంధ, శతవరి, గుగ్గులు వంటి ఆయుర్వేద ఔషధాలు ఆస్టియోపొరోసిస్ లక్షణాలను సమర్ధంగా నివారిస్తున్నాయి. అయితే కీళ్ల నొప్పులు, ఆస్టియోపొరోసిస్కు ఆయుర్వేద మూలికలను వాడే ముందు క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ను సంప్రదించాలి. కీళ్ల నొప్పుల నియంత్రణకు ఈ ఔషధాలు బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
త్రిఫల
గుగ్గుల్
అశ్వగంధ
పసుపు
అల్లం
హరిద్ర
నిర్గుండి
పునర్నవ
శిలాజిత్
సహిజన్
Read More :