కునుకమ్మ ఇలా చేరునమ్మా!

‘ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు’ అంటారు. కానీ, కంటి నిండా నిద్రతో మనసు నిండా ప్రశాంతత లభిస్తుంది. అయితే కలత నిద్రను గడప దాటించి గాఢ నిద్రను ఆస్వాదించాలంటే అందుకు కొన్ని సూత్రాలు పాటించాలి. పడక గదిలోని మంచం, దానిపై పాన్పు, కప్పుకొనే దుప్పట్లు అన్నీ బాగుంటేనే మంచి నిద్ర పడుతుంది. మనసుకూ విశ్రాంతి లభిస్తుంది.
- మంచం మీది బెడ్ షీట్స్ కూడా కంఫర్ట్‌కు కారణమే. ఎందుకంటే అవి చర్మానికి ప్రత్యక్షంగా కాంటాక్ట్‌లో ఉంటాయి. నాణ్యమైన కాటన్ బెడ్షీట్లు వాడాలి.
- కొన్నిరకాల పరుపులు చాలా గట్టిగా ఉంటాయి. వాటిపై పడుకన్నా శరీరానికి విశ్రాంతి లభించదు. ఆదమరచి నిద్రపోవాలంటే మెత్తటి నాణ్యమైన పరుపులనే
- తీసుకోవాలి.
- పరుపు ఎంత కంఫర్ట్‌గా ఉన్నా.. తలగడ సరిగ్గా లేకపోతే తలపోటే! మరీ గట్టిగా, మరీ మెత్తగా ఉండే దిండ్లను వాడొద్దు. తలపై ఒత్తిడి కలిగించని తేలికపాటి దిండ్ల వల్ల నిద్రను హాయిగా
- ఆస్వాదించవచ్చు.
- బెడ్‌షీట్ రంగులు సైతం నిద్రను ప్రభావితం చేస్తాయి. తేలికపాటి రంగులు మనసుకు ప్రశాంతతనిచ్చి త్వరగా నిద్రపుచ్చుతాయి. తెలుపు రంగు మరింత మంచిది. కానీ, మరకలు ఎక్కువగా పడతాయి. తరచూ శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

