Date | ఖర్జూరాలను తింటే బరువును తగ్గించుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
ఖర్జూరాల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో సహజసిద్ధమైన చక్కెరల ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే మనకు పోషణ లభిస్తుంది. ఖర్జూరాలు రుచికి చాలా తియ్యగా ఉంటాయి.
Dates | ఖర్జూరాల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో సహజసిద్ధమైన చక్కెరల ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే మనకు పోషణ లభిస్తుంది. ఖర్జూరాలు రుచికి చాలా తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు కానీ పెరగరు. ఖర్జూరాలను రోజూ మోతాదులో తింటే పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. వీటిని రోజూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఖర్జూరాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది సాల్యుబుల్ ఫైబర్. అందువల్ల జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. తక్కువ ఆహారం తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. కనుక అధిక బరువు ఉన్నవారు రోజూ ఖర్జూరాలను తింటే తప్పక ఫలితం ఉంటుంది.
సహజసిద్ధమైన చక్కెరలు..
ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ముఖ్యంగా ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సూక్రోజ్ అనే సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయి. సాధారణ చక్కెర కన్నా ఈ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. కనుక స్వీట్లను తినాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖర్జూరాలను తినడం మేలు. దీంతో తీపి తిన్న భావన కలుగుతుంది. ఆరోగ్యంపై దుష్ప్రభావం పడదు. అలాగే క్యాలరీలు అధికంగా చేరకుండా చూసుకోవచ్చు. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
ఖర్జూరాల్లో మన శరీరానికి అవసరం అయిన అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా బి విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెటబాలిజం పెరిగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని వల్ల క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు.
షుగర్ ఉన్నవారు కూడా..
ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ మోతాదులోనే ఉంటుంది. వీటిని తింటే అంత వేగంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. కనుక షుగర్ ఉన్నవారు కూడా మోతాదులో ఖర్జూరాలను తినవచ్చు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్ తినే బదులు నాలుగు ఖర్జూరాలను తింటే ఆకలి నియంత్రణలోకి వస్తుంది. దీంతో చిరుతిళ్లను తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణలో ఉంటుంది.
జీర్ణవ్యవస్థకు..
ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది. దీని వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలను తినడం వల్ల ఎంతగానో ఫలితం ఉంటుంది. ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఫలితంగా శరీరం శుభ్రంగా మారుతుంది. దీంతోపాటు కొవ్వు కూడా కరుగుతుంది. ఇలా ఖర్జూరాలను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే బరువును కూడా తగ్గించుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Dates
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

