Coffee | రాత్రి పూట కాఫీ తాగితే నిద్రకే కాదు.. ఈ విషయాల్లోనూ సమస్యలే వస్తాయి..
చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి కూడా కాఫీని తాగుతూ ఉంటారు. ఇలా రాత్రి సమయంలో కాఫీ తాగడం వల్ల నిద్ర భంగం అవుతుందన్న సంగతి అందరికీ చాలాకాలంగా తెలిసిందే. అయితే తాజా పరిశోధన ప్రకారం, ఇది కేవలం నిద్రపై ప్రభావం చూపడమే కాకుండా ప్రవర్తనపై కూడా ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది.
Coffee | చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి కూడా కాఫీని తాగుతూ ఉంటారు. ఇలా రాత్రి సమయంలో కాఫీ తాగడం వల్ల నిద్ర భంగం అవుతుందన్న సంగతి అందరికీ చాలాకాలంగా తెలిసిందే. అయితే తాజా పరిశోధన ప్రకారం, ఇది కేవలం నిద్రపై ప్రభావం చూపడమే కాకుండా ప్రవర్తనపై కూడా ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది. ముఖ్యంగా మహిళల్లో ఆత్రుత (impulsivity), ప్రమాదకర నిర్ణయాల వైపు మొగ్గు చూపే అవకాశముందని అధ్యయనం చెబుతోంది. కాఫీలో ఉండే కెఫీన్ శక్తివంతమైన ఉద్దీపక పదార్థం. ఇది మెదడులో నిద్రను ప్రోత్సహించే అడెనోసిన్ అనే రసాయనాన్ని నిరోధించి మేల్కొలుపును పెంచుతుంది. అందుకే రాత్రివేళ కాఫీ తాగితే నిద్రపోవడం కష్టమవుతుంది.
ఆలోచించకుండా స్పందించే అవకాశం..
కానీ తాజా పరిశోధనలు ఈ ప్రభావం నిద్రకే పరిమితం కాదని సూచిస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం, రాత్రి సమయంలో కెఫీన్ తీసుకున్నప్పుడు ప్రవర్తన నియంత్రణ తగ్గే అవకాశం ఉంటుందని తేలింది. పరిశోధకులు ఫ్రూట్ ఫ్లైస్పై చేసిన పరీక్షల్లో, రాత్రివేళ కెఫీన్ తీసుకున్న వాటిలో ఆలోచించకుండా స్పందించే స్వభావం ఎక్కువగా కనిపించినట్లు గుర్తించారు. అవి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ చర్యలను నియంత్రించలేకపోయినట్లు గమనించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే ప్రభావం పగటిపూట కెఫీన్ తీసుకున్నప్పుడు కనిపించలేదు. అంటే కాఫీ తాగే సమయం చాలా కీలకమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. మహిళల్లో ఈ ప్రభావం మరింతగా ఉంటుందని పరిశోధన సూచిస్తోంది.
మహిళల్లో వేరుగా..
హార్మోన్లు, మెటబాలిజం, మెదడు రసాయనాల వ్యత్యాసాల కారణంగా కెఫీన్ ప్రభావం మహిళల్లో వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే కారణంగా మహిళల్లో ఆత్రుత, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కెఫీన్ మెదడులో డోపమైన్, నోరెపినెఫ్రిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్తేజితం చేస్తుంది. ఇది దృష్టి కేంద్రీకరణకు సహాయపడినా, అధిక స్థాయిలో ఉంటే మెదడును అతిగా ఉత్తేజితం చేస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో శరీరం విశ్రాంతికి సిద్ధమవుతున్నప్పుడు ఇది సహజ రిథమ్‌ను దెబ్బతీస్తుంది. నిద్రలేమి వల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ నియంత్రణ తగ్గిపోతాయి. ఈ పరిస్థితిలో కెఫీన్ కూడా తోడైతే, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆర్థిక నిర్ణయాలు, డ్రైవింగ్, ఇతర ప్రవర్తనలపై కూడా ప్రభావం చూపిస్తుంది.
దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం..
అయితే ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో, రాత్రివేళ పని చేయడానికి చాలా మంది కాఫీపై ఆధారపడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ వర్కర్లు ఎక్కువగా కెఫీన్ తీసుకుంటున్నారు. ఇది తాత్కాలికంగా మెళకువను ఇచ్చినా, దీర్ఘకాలంలో నిద్ర, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాఫీ తాగడంలో పరిమితి మాత్రమే కాకుండా సమయం కూడా ముఖ్యమని ఈ అధ్యయనం చెబుతోంది. రాత్రివేళ కాఫీ తాగడం తగ్గించి, పగటిపూట మాత్రమే తీసుకోవడం ద్వారా నిద్ర నాణ్యతతోపాటు మెదడు పనితీరు, నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Coffee
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

