Green Beans | గ్రీన్ బీన్స్‌ను తరచూ తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..? తెలిస్తే వెంటనే తింటారు..!
న్ బీన్స్.. చాలా మంది వీటిని చూసే ఉంటారు. ఇతర కూరగాయల్లాగే ఇవి కూడా మనకు మార్కెట్లో లభిస్తుంటాయి. కానీ గ్రీన్ బీన్స్‌ను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు.
Green Beans | గ్రీన్ బీన్స్.. చాలా మంది వీటిని చూసే ఉంటారు. ఇతర కూరగాయల్లాగే ఇవి కూడా మనకు మార్కెట్లో లభిస్తుంటాయి. కానీ గ్రీన్ బీన్స్‌ను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. గ్రీన్ బీన్స్‌ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు తమ ఆహారాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గ్రీన్ బీన్స్ వాస్తవానికి చాలా ఆరోగ్యకరమైన కూరగాయల కిందకు వస్తాయి. గ్రీన్ బీన్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ గ్రీన్ బీన్స్‌ను తింటే అనేక వ్యాధులు నయం అవుతాయని వారు అంటున్నారు. అంతేకాదు.. ఈ బీన్స్ అనేక పోషకాలకు నెలవుగా కూడా ఉన్నాయి. గ్రీన్ బీన్స్‌ను తరచూ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ లెవల్స్..
బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. గ్రీన్ బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. గ్రీన్ బీన్స్‌ను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అలాగే ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా మలబద్దకం ఉన్నవారు రోజూ గ్రీన్ బీన్స్‌ను తింటే సుఖంగా విరేచనం అవుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గర్భిణీలకు..
గ్రీన్ బీన్స్‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలు బీన్స్‌ను తింటే శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుకతో లోపాలు రాకుండా నివారించవచ్చు. గ్రీన్ బీన్స్ లో పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి గ్రీన్ బీన్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. గ్రీన్ బీన్స్‌లో ఐరన్ కూడా ఎక్కువే. రక్తహీనత ఉన్నవారు తరచూ గ్రీన్ బీన్స్‌ను తింటే రక్తం తయారవుతుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
కండరాల ఆరోగ్యానికి..
గ్రీన్ బీన్స్‌లో అధికంగా ఉండే మెగ్నిషియం కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల నిర్మాణానికి సహాయం చేస్తుంది. కండరాలు పట్టుకుపోకుండా చూసుకోవచ్చు. కండరాల నొప్పులు సైతం తగ్గుతాయి. గ్రీన్ బీన్స్‌లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా గ్రీన్ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే గ్రీన్ బీన్స్ ఆరోగ్యకరమే అయినప్పటికీ కొందరికి సరిగ్గా జీర్ణం కావు. వీటిని తింటే అజీర్తి సమస్య వచ్చేవారు వీటిని తినకపోవడమే మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- green beans
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

