క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల్లో బోన్ క్యాన్సర్ ఒకటి. ఎముకల్లో అసాధారణ కణాలు నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. ఇది సాధారణంగా పెల్విస్ లేదా చేతులు, కాళ్లల్లో పొడవాటి ఎముకలను ప్రభావితం చేస్తుంది. ఇతర క్యాన్సర్‌కు గురైన వ్యక్తుల శరీరంలో ఈ బోన్క్యాన్సర్ ద్వితీయ వ్యాప్తి ద్వారా అభివృద్ధి చెందుతుంది. పది రకాల లక్షణాలను బట్టి ఈ ఎముక క్యాన్సర్‌ను గుర్తించొచ్చు. మీలో ఈ పది లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
1. నొప్పి, వాపు..
స్థిరమైన నొప్పి, వాపు ఆందోళన కలిగిస్తుంది. మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నొప్పి భరించలేక రాత్రిళ్లు నిద్రనుంచి మెళకువ వస్తుంది. నొప్పివల్ల సరిగ్గా నిద్రపట్టదు.
2. బరువు తగ్గడం..
ఆకస్మికంగా బరువు తగ్గుతారు. ఉన్నట్టుండి కిలోల కొద్దీ బరువును కోల్పోతారు. పీలగా మారిపోతారు.
3. తీవ్రమైన అలసట..
మీరు అన్ని వేళలా అలసిపోతున్నారా? మీకు అన్ని వేళలా అనారోగ్యంగా అనిపిస్తున్నదా? మీరు రోజువారీ పనులను సులభంగా చేయలేకపోతున్నారా? అయితే, తప్పకుండా పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. అలసట కూడా ఎముక క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.
4. కుంటుతూ నడుస్తున్నారా..?
కొందరు ఉన్నట్టుండి సడెన్‌గా కుంటుతూ నడుస్తారు. ఇలాంటివారు వెంటనే బోన్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బోన్ క్యాన్సర్ ప్రముఖ లక్షణాల్లో లింపింగ్ (కుంటుతూ నడవడం) ఒకటి.
5. రాత్రి చెమటలు పడుతున్నాయా?
మీకు రాత్రి సమయంలో విపరీతంగా చెమటలు పడుతున్నాయా? చెమటలతో శరీరం మొత్తం తడిసిపోతున్నదా? అయితే, ఇది బోన్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు.
6. కదల్లేని అసమర్థత..
మీరు కదల్లేకపోతున్నారా? ఉన్నచోటునుంచి నడవలేకపోతున్నారా? లేదా కూర్చోలేకపోతున్నారా? అయితే, వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఎందుకంటే బోన్ క్యాన్సర్ ఉన్నవారిలో ఈ లక్షణం ప్రముఖంగా కనిపిస్తుంది.
7. జ్వరం..
తరుచూ జ్వరం అనేది బోన్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. నెలలో రెండు లేదా మూడుసార్లు జ్వరంబారిన పడితే వెంటనే బోన్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
8. ఎముకపై గడ్డ..
ఎముక క్యాన్సర్ లక్షణాలలో ఇది కూడా ఒకటి. ఎముకపై గడ్డ ఏర్పడుతుంది.
9. ఎముకపై పగుళ్లు..
ఎముకపై పగుళ్లు కనిపిస్తే అది బోన్ క్యాన్సర్‌కు సంకేతం. బలహీనమైన ఎముక బోన్ క్యాన్సర్‌కు సంకేతమని వైద్యులు చెబుతున్నారు.
10. కీళ్ల దృఢత్వం..
మీ కీళ్లు దృఢంగా ఉన్నాయా? మీ రోజువారీ కార్యకలాపాలను సులభంగా చేయడం మీకు కష్టంగా అనిపిస్తుందా? అయితే, అది బోన్ క్యాన్సర్ లక్షణమేనని వైద్యులు అంటున్నారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.