Health Tips | చింతపండు లేని భారతీయ వంటకాల్ని ఊహించడం కష్టం. మనవైన షడ్రుచులలో చింతపండు పులుపునకు ప్రతీక. ఆ పులుపే దాని ఔషధ గుణాలకు కారణం కూడా. చింతపండులోని పైరాజిన్, లిమనీస్ లాంటి పదార్థాలకు అనేక ప్రత్యేకతలు..
మలేరియా: చింతపండు కషాయంతో మలేరియాను ఎదుర్కొనే విధానం సంప్రదాయ వైద్యంలో కనిపిస్తుంది.
పసరికలు: చింతాకులను మరిగించి, ఆ నీరు తాగితే పచ్చకామెర్లు దూరం అవుతాయని నమ్మకం.
మలబద్ధకం: ఈ సమస్యను సరిదిద్దే గుణం చింతపండులో అపారం. ఇది విరేచనకారిగా పనిచేసి కడుపును శుభ్రం చేస్తుంది.
కొలెస్ట్రాల్: చెడు కొవ్వును తగ్గించి, గుండెను పదిలంగా ఉంచే లక్షణం చింతపండుకు ఉంది.
క్యాన్సర్: చింతపండులోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందవు. ఇంతేనా! చింతపండుతో ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. ఊపిరి తిత్తులు, కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పులు, జ్వరాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మోతాదుకు మించకుండా, వంటలో భాగంగా వాడే కాస్తంత చింతపండు… ఆరోగ్యపరమైన చింతలన్నిటినీ దూరం చేస్తుంది. కాకపోతే, వైద్యుల సలహా తప్పనిసరి.