ఈతతో పీసీఓఎస్ తగ్గుతుందా?
నా వయసు 22 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు. 60 కేజీల బరువున్నాను. మూడేండ్లుగా పీసీఓఎస్‌తో బాధపడుతున్నాను. డాక్టర్ బరువు తగ్గమన్నారు.
నా వయసు 22 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు. 60 కేజీల బరువున్నాను. మూడేండ్లుగా పీసీఓఎస్‌తో బాధపడుతున్నాను. డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను స్విమ్మింగ్ చేయాలి అనుకుంటున్నాను. పీసీఓఎస్ నియంత్రించడానికి ఇది పనికొస్తుందా. తెలుపగలరు?
- ఓ పాఠకురాలు
మీ ఎత్తుకు, వయసుకు బరువు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇది తగ్గించుకోవడంలో వ్యాయామంతోపాటు ఆహారానికీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మన శరీర నిర్మాణంలో 75శాతం ఆహారం, 25 శాతం వ్యాయామం పాత్ర ఉంటుంది. కాబట్టి ముందు ఎలాంటి ఆహారం తింటున్నారు అన్నది చూసుకోండి. చక్కెరలు, నూనెలు, ఫాస్ట్‌ఫుడ్‌లకు దూరంగా ఉండండి. ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా తినండి. అలాగని చక్కెరలు అధికంగా ఉండే మామిడి పండ్లలాంటివి మరీ ఎక్కువ తినకూడదు.
గట్టిగా తిని వ్యాయామం చేస్తే కండ పడతారు తప్ప బరువు తగ్గరు. ఒక ట్రిక్ పాటిస్తే బరువు తగ్గడం సులభం. అన్నం తినేప్పుడు రెండు రకాలే ఉండేలా చూసుకోండి. పప్పు, పెరుగు లేదా కూర, పెరుగు ఇలా. అందులోనూ కూర, పప్పుల్లాంటివి కారం తక్కువ వేసుకుని అన్నం పరిమాణానికి సమానంగా ఉండేలా తినాలి. అప్పుడు రెండు రకాలే కాబట్టి సాధారణంగానే తక్కువ తింటాం. ఇలా చేస్తూ ఈతకొట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా పీసీఓఎస్ నియంత్రణలోకి వస్తుంది.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

