SunScreen Lotion | వింటర్లోనూ సన్‌స్క్రీన్ వాడటం తప్పనిసరి..ఎందుకంటే..!
SunScreen Lotion : సూర్యరశ్మి నుంచి వెలువడే హానికారక యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడుతుంటారు. వేసవిలోనే కాకుండా వింటర్లోనూ తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలని స్కిన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
SunScreen Lotion : సూర్యరశ్మి నుంచి వెలువడే హానికారక యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడుతుంటారు. వేసవిలోనే కాకుండా వింటర్లోనూ తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలని స్కిన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎండకు ఎక్స్పోజ్ అయ్యే క్రమంలో యూవీ కిరణాల ప్రభావం నుంచి ముఖ్యంగా వయసుమీద పడటం వంటి లక్షణాలతో పాటు హానికారకాల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్‌స్క్రీన్ లోషన్ సమర్ధంగా పనిచేస్తుంది.
ఇందులో ఉండే జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్, ఆక్సీబెంజోన్, ఆక్టినోక్సైట్, ఆక్టిసలేట్, అవొబెంజోన్ వంటి పదార్ధాలు యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంటాయి. అయితే భానుడి భగభగలు తీవ్రంగా ఉండే వేసవిలోనే ఇవి చర్మానికి అవసరమని చాలా మంది భావిస్తుంటారు. వింటర్లోనూ సన్‌స్క్రీన్ ప్రాధాన్యతను స్కిన్ ఎక్స్‌పర్ట్‌లు వివరిస్తున్నారు. చలికాలంలోనూ చర్మ క్యాన్సర్ వంటి పలు తీవ్ర వ్యాధులకు దారితీసే యూవీఏ, యూవీబీ కిరణాలు పంజా విసురుతాయని, ఈ రెండు హానికారక కిరణాల నుంచి సన్‌స్క్రీన్, సన్‌బ్లాక్ లోషన్లు చర్మాన్ని కాపాడతాయని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.
వింటర్లో సన్‌స్క్రీన్ వాడకుంటే స్కిన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వింటర్లోనూ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వయలెట్ కిరణాలు ప్రమాదకరమైనవని, ముఖ్యంగా ఓజోన్ పొర క్షీణిస్తున్న క్రమంలో ప్రమాదకర కిరణాలు చర్మాన్ని తాకే ప్రమాదం అధికమని చెబుతున్నారు. సన్‌స్క్రీన్ లోషన్ వాడటం వల్ల ముందుగానే వయసు మీరినట్టు కనిపించడం, స్కిన్ క్యాన్సర్ నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆకాష్ హెల్త్‌కేర్‌కు చెందిన డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ కాను వర్మ చెబుతున్నారు.
Read More :
Immunity Boosters | వంటింట్లో ఇన్ని దివ్యౌషధాలున్నాయా.. మీరూ ట్రై చేయండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

