కొవిషీల్డ్ మూడో డోసుపై ఆధార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు

ముంబై : కొవిడ్-19 నుంచి దీటైన రక్షణ పొందేందుకు వ్యాధి నిరోధక శక్తి దీర్ఘకాలం కొనసాగేలా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని పలు అభివృద్ధి చెందిన దేశాలు టీకా మూడో డోసును చేపడుతున్నాయి. అభివృద్ది చెందుతున్నదేశాలు, పేద దేశాలు మాత్రం ఇంకా కరోనా టీకా తొలి డోసును కూడా అత్యధిక జనాభాకు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
మరోవైపు భారత్‌లో అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు చెందిన ఆధార్ పూనావాలా మూడో డోసు ఆవశ్యకతపై నిర్ధిష్ట ఆధారాలు లేవని చెప్పడంతో పాటు బూస్టర్ డోస్ అనైతికమని వ్యాఖ్యానించారు. ఇక పూనావాలా తండ్రి ఎస్ఐఐ చీఫ్ సైరస్ పూనావాలా గతంలో టీకా మూడవ డోసు తప్పనిసరిగా తీసుకోవాలని రెండో డోసు తీసుకున్న ఆరు నెలల్లోగా మూడో డోసు తీసుకోవాలని చెప్పడం గమనార్హం.

అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే అతి కొద్దిమందిలో వీటి అవసరం ఉండవచ్చని ఆయన అలా చెప్పి ఉంటారని ఆధార్ పూనావాలా వివరణ ఇచ్చారు. మూడో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉందనేందుకు ఆధారాలు లేవని, దీనిపై అధికారికంగా ఎలాంటి సిఫార్సులూ లేవని చెప్పుకొచ్చారు. కాగా వ్యాక్సిన్ సామర్ధ్యం కొద్దికాలానికి తగ్గుముఖం పడుతున్నందున బూస్టర్ డోస్‌లు ఇవ్వడం అవసరమని ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్ తయారీ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారితో పాటు అవయవ మార్పిడి జరిగిన వారిలో బూస్టర్ డోస్‌ల అవసరం ఉండవచ్చని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

