Health | చలికాలంలో రోగాల బారిన పడొద్దంటే ఈ పండ్లను మస్ట్‌గా తినండి!
Health | చలికాలంలో జలుబు, ఫ్లూ లాంటి శ్వాసకోశ సమస్యలు పీడిస్తుంటాయి. చలి కారణంగా ఎక్కువ సేపు ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది.
Health | చలికాలంలో జలుబు, ఫ్లూ లాంటి శ్వాసకోశ సమస్యలు పీడిస్తుంటాయి. చలి కారణంగా ఎక్కువ సేపు ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఒకరి నుంచి ఒకరికి వైరస్లు సులువుగా సోకుతాయి. అంతేకాదు, పొడి వాతావరణం రోగ నిరోధక శక్తిని బలహీనం చేస్తుంది. మనకు అందుబాటులో ఉండే వివిధ పండ్లతో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలను దూరంగా తరిమికొట్టవచ్చు.

నిమ్మజాతి పండ్లు: విటమిన్-సి అధికంగా ఉండే నారింజ లాంటి నిమ్మజాతి పండ్లు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. చలికాలపు రుగ్మతలైన జలుబు, ఫ్లూ నుంచి కాపాడతాయి.

యాపిల్: ఫైబర్ సమృద్ధిగా ఉండే యాపిల్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలమే. యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు.

అరటి: ఏడాదంతా అందుబాటులో ఉండే అరటిలో పొటాషియం పుష్కలం. చిరుతిండికి మంచి ఎంపిక. తొందరగా శక్తిని ఇస్తుంది.

దానిమ్మ: యాంటీ ఆక్సిడెంట్ల గని. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండుగా తిన్నా, సలాడ్లు, యోగర్ట్‌తో కలిపి తీసుకున్నా మంచిదే.

కివీ: విటమిన్-సి, కె, ఫైబర్‌తో కూడిన కివీ పండు పోషకాల భాండాగారం. రుచికరమైన కివీ పండును అలానే తినొచ్చు. లేదంటే ఫ్రూట్ సలాడ్లలో కలిపి తీసుకునీ ఆస్వాదించవచ్చు.

బెర్రీ పండ్లు: స్ట్రాబెర్రీ అయినా, బ్లూబెర్రీ అయినా.. చలి బారినుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఉత్తమ ఎంపిక. బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

ద్రాక్ష: ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగుల్లో దొరికే ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. తియ్య తియ్యటి ద్రాక్ష చిరుతిండికి మంచి ఎంపిక. ఫ్రిజ్‌లో పెట్టుకుని అప్పుడప్పుడు తినొచ్చు. సలాడ్లలో కలుపుకొని కూడా రిఫ్రెష్ కావొచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

