మతిమరపు.. అత్తరు చికిత్స
ఒక అస్పష్టమైన వాసన ముక్కుపుటాలకు తాకినప్పుడు.. మనం గత స్మృతుల్లోకి వెళ్లడాన్ని.. ఏదో ఓ సందర్భంలో అనుభూతించే ఉంటాం. అంతేకాదు. ఆ వాసనతో ముడిపడిన జ్ఞాపకాలు కూడా మనసులో మెదులుతాయి.
ఒక అస్పష్టమైన వాసన ముక్కుపుటాలకు తాకినప్పుడు.. మనం గత స్మృతుల్లోకి వెళ్లడాన్ని.. ఏదో ఓ సందర్భంలో అనుభూతించే ఉంటాం. అంతేకాదు. ఆ వాసనతో ముడిపడిన జ్ఞాపకాలు కూడా మనసులో మెదులుతాయి. ఈ లక్షణమే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులను వృద్ధుల్లో వచ్చే మతిమరుపు వ్యాధి.. డెమెన్షియా చికిత్సకు పరిష్కారం కొనుగొనే దిశగా అడుగులు వేయించింది. అత్తర్లతో చికిత్స చేసి వృద్ధుల్లో చెరిగిపోయిన జ్ఞాపకాలను చిగురింపజేయాలనేది పరిశోధకుల ప్రయత్నం. తమ అధ్యయనం కోసం కొంతమంది వయోధికులను రెండు వర్గాలుగా విభజించారు.
ఒకవైపు వారిని అత్తరు పరిమళానికి గురిచేశారు. మరో వర్గానికి అలాంటి ఏర్పాటు చేయలేదు. ఆరు నెలలపాటు రోజూ ఇలా చేస్తూ వచ్చారు. మిగిలిన వారికంటే.. పరిమళం పీల్చిన పెద్దల్లో జ్ఞాపకశక్తి సామర్థ్యం 226 శాతం మెరుగుపడినట్టు గుర్తించారు. సువాసనల ప్రభావం వల్ల భాషా నైపుణ్యాలు పెరిగినట్టు, కుంగుబాటు తగ్గినట్టు, ఘ్రాణశక్తి మెరుగుపడినట్టు ఇంతకుముందు పరిశోధనల్లోనే తేలింది. ఈ ఫలితాలనే వృద్ధుల్లో డెమెన్షియాపై పోరాటానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు పరిశోధకులు. పైగా రోజూ రాత్రిళ్లు ఓ రెండు గంటలపాటు అత్తరు పరిమళాన్ని ఆస్వాదించిన వారికి నిద్ర కూడా బాగా పట్టిందట.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

