Onions | ఎర్ర ఉల్లిగడ్డ? తెల్ల ఉల్లిగడ్డ? ఆరోగ్యానికి ఏది మంచిది?

నిజానికి ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డల్లోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియెంట్ ఆరోగ్యానికి అంతే శ్రేయస్కరం కూడా.

మన వంటకాలను ఉల్లిగడ్డలు లేకుండా ఊహించలేం. ఏ కూర వండినా సరే అందులో ఒక ఉల్లిగడ్డ వేయాల్సిందే. ఉల్లిపాయ వేస్తేనే కర్రీ టేస్ట్ అనిపిస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.. అందుకే.. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటుంటారు. అయితే మన మార్కెట్లో ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లిగడ్డ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి వీటిలో ఏది బెటర్? ఏ రంగు ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం అనే సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది.

పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిగడ్డలను తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉల్లిగడ్డలకు ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు.

తెల్ల ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి.

తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది.
తాజా వార్తలు
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
