Winter Delight : చలికాలం క్యాలరీలు తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉండే ఆహారంతో (Winter Delight) మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉండి, పరిమిత క్యాలరీలతో టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌తో రోజును ఆరోగ్యంగా ప్రారంభించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక నూనె తక్కువగా వాడుతూ పాలక్ కార్న్ చిల్లాను వింటర్లో బెటర్ బ్రేక్‌ఫాస్ట్‌గా సూచిస్తున్నారు.
ఈ డిష్‌లో వాడే పదార్ధాలు మన శరీరానికి అవసరమైన శక్తినీ, ఉత్తేజాన్ని ఇచ్చేవి కావడంతో రోజంతా ఉత్సాహంగా గడిపేయవచ్చు. పాలకూరలో విటమిన్ ఏ, సీ, కే, ఫోలేట్ ఉండగా కార్న్‌లో శరీరానికి అత్యవసరమైన ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక శనగపిండి మంచి ప్రొటీన్ వనరుగా చెబుతారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ డిష్‌లో క్యాలరీలు పరిమితంగా ఉండటంతో ఇది మేలైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారికి పాలక్ కార్న్ చిల్లా మెరుగైన ఎంపిక. ఇందులో మీరు ఎన్ని రకాల కూరగాయలు, స్పెసెన్ను యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిఉండటంతో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌లోనూ పెద్దగా మార్పులు ఉండవు. ఇందులో ఉండే ఫైబర్‌తో ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండటంతో అతిగా ఆహారం తీసుకునే అవసరం ఉండదు. అందుకే శనగపిండిని మధుమేహులూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
Read More :
Watch: జైలులో పుట్టిన రోజు జరుపుకున్న ఖైదీ.. చాయ్ పకోడీతో తోటి ఖైదీలకు పార్టీ