Pain in Chest | ఛాతీలో నొప్పి.. గుండె సమస్యా లేక గ్యాస్ సమస్యా..? తెలుసుకోండి ఇలా..!
Pain in Chest | ఛాతీలో ఏ రకంగా నొప్పివేసినా గుండె నొప్పిగా అనుకుని గాబరా పడిపోయి పక్కవాళ్లను కూడా గాబరా పెడుతుంటాం. అసలు ఛాతీలో నొప్పికి గుండె నొప్పికి తేడా ఏంటి..? ఛాతీలో నొప్పితో...
Pain in Chest | ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి మొదలైందంటే మనం గాబరా పడిపోతుంటాం. అది గుండె నొప్పిగా భావించి భయపడుతుంటాం. ఇటీవల ఎప్పుడూ రాలేదు అని ఆలోచిస్తుంటాం. ఎందుకలా జరిగిందో వైద్యుడి సలహా తీసుకోవాలనుకుంటాం.. అయితే, ఛాతీలో వచ్చే అన్ని రకాల నొప్పులు గుండె సమస్యగా భావించడం వల్లనే మనం భయపడిపోతుంటామన్నది అసలు విషయం. ఛాతీలో ఏ రకంగా నొప్పివేసినా గుండె నొప్పిగా అనుకుని గాబరా పడిపోయి పక్కవాళ్లను కూడా గాబరా పెడుతుంటాం. అసలు ఛాతీలో నొప్పికి గుండె నొప్పికి తేడా ఏంటి..? ఛాతీలో నొప్పితో గ్యాస్ సమస్యకు సంబంధముందా..? అనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
- గ్యాస్టిక్ సమస్య వల్ల కూడా గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాలు ఎసిడిటీని కలిగిస్తాయి. ఛాతీ దగ్గర్లో మంటని కలిగిస్తాయి. ఈ పరిస్థితిని గ్యాస్ట్రోఈసోఫజెల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. దీనిని ఇలాగే వదిలేస్తే ఆస్తమాకు, ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
- గ్యాస్ కారణంగా ఛాతీలో ఎడమవైపు నొప్పిగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పుల్లని త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి. గుండెల్లో మండుతున్నట్లు భావన కలుగుతుంది.
- గ్యాస్ నొప్పి మనం వేలుతో పాయింట్ చేసేంత ప్లేస్లోనే ఉంటుంది. అది కూడా ఓసారి ఒక దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఉంటుంది.
- ముందుకు వంగి నప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీలో ఉండే నొప్పి పడుకున్నప్పుడు వీపు భాగంలో ఉంటుంది. అదే గుండె నొప్పి వచ్చినట్లయితే పడుకున్నా లేచినా నొప్పి ఒకేచోట ఉంటుంది.
- గుండె నొప్పి ఛాతీతో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్ అంతా ఒకేసారి నొప్పి కనిపిస్తుంది. ఛాతీ భాగం బరువుతో కూడిన నొప్పిని కలిగిస్తుంది.
- అలాగే, విపరీతమైన చెమట వస్తుంది. కొందరిలో అనుకోకుండా వాంతులు, విరేచనాలు అవుతుంటాయి.
- ఇలా గ్యాస్ సమస్య కారణంగా ఛాతీలో మంటగా ఉన్నప్పుడు పల్చటి మజ్జిగ రెండు గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది.
- అలా కూడా తగ్గనిపక్షంలో గ్లాసెడు నీటిలో ఈనో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.
- ఫైబర్ ఎక్కువగా ఉండే బీరకాయ కూర తినాలి.
- పరిగడుపునే గ్లాసెడు నీటిలో అర చెంచా జీలకర్ర వేసి మరిగించి చల్లార్చి తాగడం అలవాటు చేసుకోవాలి.
అంతే కాకుండా.. బాగా బరువులు ఎత్తినప్పుడు కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పుడు కూడా గుండె నొప్పిగా ఉంటుంది. ఊపిరితిత్తుల భాగంలో వాపులాంటివి వస్తే ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఛాతీ నొప్పికి కారణమవుతుందని కూడా గుర్తుంచుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

