Health Tips | సమతుల ఆహారమే.. మన ఆరోగ్యానికి హామీ
మన ఆరోగ్యానికి సమతుల ఆహారమే హామీ ఇస్తుంది. రోజువారీ భోజనంలో అన్నంతోపాటు ఐదు రకాల రంగురంగుల కూరగాయలను సమపాళ్లలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Health Tips | మన ఆరోగ్యానికి సమతుల ఆహారమే హామీ ఇస్తుంది. రోజువారీ భోజనంలో అన్నంతోపాటు ఐదు రకాల రంగురంగుల కూరగాయలను సమపాళ్లలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే తినే పళ్లాన్నే కాకుండా మన జీవితాన్నీ రంగులమయం చేసుకోవచ్చు, ఆరోగ్యంగా బతికేయొచ్చు.

క్యారట్లు
128 గ్రాములు తీసుకోవాలి. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. రోజువారీగా అవసరమైన ఎ విటమిన్లో 119 శాతం దీన్నుంచి లభిస్తుంది. క్యాన్సర్ నివారణకు వీటిలో ఉండే బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ దోహదపడుతుంది.

పాలకూర
30 గ్రాములు తీసుకోవాలి. రోజువారీ విటమిన్ ఎ అవసరంలో 16 శాతం లభిస్తుంది. అలానే విటమిన్ కె 120 శాతం అందుతుంది. క్యాన్సర్ ముప్పును పాలకూర తగ్గిస్తుంది.

బ్రకోలి
91 గ్రాముల బ్రకోలి నుంచి రోజువారీ విటమిన్ కె 77 శాతం లభిస్తుంది. విటమిన్ సి 90 శాతం అందుతుంది. అదనంగా ఫోలేట్, మాంగనీస్, పొటాషియం కూడా లభిస్తాయి. ఇది కూడా క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. గుండెజబ్బులకు సంబంధించిన ఇన్ఫ్లమేటరీ కారకాలను నియంత్రిస్తుంది.

పచ్చి బటానీలు
160 గ్రాముల బటానీల్లో 9 గ్రాముల ఫైబర్, 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఎ, సి, కె విటమిన్లు, రిబోఫ్లెవిన్, థయామిన్, నియాసిన్ లాంటి బి కాంప్లెక్స్ విటమిన్లు, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, ట్యూమర్ల ముప్పు తగ్గడానికి పచ్చి బటానీలు దోహదపడతాయి.

కేల్
21 గ్రాముల కేల్లో పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఎ, బి, సి, కె విటమిన్లు అందుతాయి. రక్తంలో చక్కెర స్థాయులు, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయులను ఇది తగ్గిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

